ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్

దేశంలో క్రీడలను ప్రోత్సహించటం, క్రీడా లక్ష్యాలను సాధించి అగ్రశ్రేణి క్రీడా దేశం గా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష పై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర ప్రాంతాల క్రీడా శాఖ మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ వర్చువల్ మీటింగ్ లో మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్రీడా అకాడమీ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ను క్రీడా హబ్ గా రూపొందించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారని, రాష్ట్రంలో సమగ్ర క్రీడాభివృద్ధిని సాధించే దిశగా దేశంలోనే అత్యున్నతమైన నూతన క్రీడా విధానాన్ని ప్రకటించడానికి కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించటానికి వివిధ దేశాల క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ .

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి , క్రీడాకారులను ప్రోత్సాహించటం కోసం క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ను ప్రవేశపెట్టి క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. ఖేలో ఇండియా కార్యక్రమంను తెలంగాణ రాష్ట్రం సమర్ధవంతంగా, విజయవంతం గా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గ. అందులో భాగంగా ఖేలో ఇండియా పోటీలను క్రమబద్ధంగా నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూన్నామన్నారు. ఖేలో ఇండియా పోటీల్లో 219 మంది క్రీడాకారులు పాల్గొని 53 మెడల్స్ లను తెలంగాణ క్రీడాకారులు గెలుచుకున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో మెదక్, కరీంనగర్, వరంగల్ లలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను కేంద్ర క్రీడా శాఖ ( SAI) మంజూరు చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్ లో సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం 7. 50 కోట్లు, సిద్దిపేట లో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం కోసం 10 కోట్లు రూపాయల ప్రాధాన్యత ప్రతిపాదనల ను కేంద్ర ప్రభుత్వం కు సమర్పించామన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రమాణాలైన షూటింగ్ రేంజ్, ఆక్వాటిక్స్, బ్యాడ్మింటన్, రెండు సింథటిక్ ట్రాక్స్ , రెండు అస్ట్రోటర్ఫ్ హాకీ గ్రౌండ్స్ లతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం 52 కోట్ల రూపాయల ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించామని వెంటనే ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ఈ వర్చువల్ మీటింగ్ లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో , ఒలింపిక్స్ లో పథకాలు సాధించిన క్రీడాకారులకు నగదు పురస్కారాలను భారీగా పెంచామన్నారు అలాగే, ఇంటి స్థలాలను అందించటం జరుగుతున్నద్దన్నారు.క్రీడాకారులతో పాటు కోచ్ లకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో క్రీడల అభివృద్ధి కి , క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కు రాష్ట్ర పరిశ్రమల, IT శాఖ మంత్రి KTR సూచనల మేరకు పారిశ్రామికవేత్తల సహకారంతో క్రీడల అభివృద్ధికి చర్యలు చేపట్టాబోతున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ .

తెలంగాణ రాష్ట్రం లో కరీంనగర్, ఆదిలాబాద్, హాకీంపేట్ లలో మూడు క్రీడా పాఠశాలున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కు మరో మూడు క్రీడా పాఠశాలలను కేటాయించాలని ఈ మీటింగ్ లో కోరారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారిలో క్రీడా ప్రావీణ్యం వెలికితీస్తున్నామన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో క్రీడా పోటీల లను నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కి అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కోరారు. ప్రపంచంలో జనాభాలో రెండవ స్థానంలో ఉన్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదిక లపై పతకాలు సాధించటం లో మాత్రం చివరి వరసలో నిలుస్తున్నామన్నారు. అగ్రశ్రేణి క్రీడా దేశం గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రాల్లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కు ప్రాధాన్యత కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ను రాష్ట్ర మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ కోరారు. రెగ్యులర్ గా ఈలాంటి వర్చువల్ మీటింగ్ లు, సమావేశాలు నిర్వహించాలని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.

ఈ వర్చువల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *