ముగిసిన ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు గాంధీనగర్ లో ముగిసాయి. సోదరులతో కలిససి మోదీ… చివరిసారి తల్లి పాదాలకు నమస్కరించి.. చితికి నిప్పంటించారు. గాంధీనగర్‌లోని సెక్టార్ 30 శ్మశాన వాటికలో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు నిర్వహించారు. హీరాబెన్ అంత్యక్రియలకు ప్రధాని మోదీతోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. అంత్యక్రియలు జరిగుతున్న ఘటనాస్థలికి రావద్దని కుటుంబసభ్యులకు స్థలం ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలను ప్రధాని కోరారు.

అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో హీరాబెన్ మరణించారనే వార్త వెలువడగానే దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రజల నుంచి సంతాపాలు, నివాళులు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంతాపం తెలిపారు.. నరేంద్ర మోదీజీ తల్లి శ్రీమతి హీరాబెన్ మోదీ మరణవార్త వినడం బాధాకరం. దానిని భరించే శక్తి ప్రధానికి కలగాలని కోరుకుంటున్నాను అని ఎన్సీపీ నేత అజిత్ పవార్ ట్వీట్ చేశారు.