నిరుపేద రోగుల్లో భరోసా నింపుతున్న సీఎం సహాయనిధి

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో అండగా నిలుస్తూ నిరు పేదల్లో భరోసా నింపుతోంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌వో రాష్ట్ర ప్రభుత్వం కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. తాజాగా అనకాపల్లి దేవరాపల్లి మండలం, మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసి పంచాడ సింహాచలం నాయుడు బోన్ టిబి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందారు. దీని నిమిత్తం అయిన ఖర్చును వివరాలుతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోగా డిప్యూటీ సీఎం ప్రత్యేక చొరవతో సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ఈ మేరకు సింహాచలం నాయుడుకి వైద్యానికి అయిన 4,94,000 లక్షల రూపాయల పూర్తి నగదు మంజూరు చేశారు. ఈ చెక్ ను సింహాచలం నాయుడు ఇంటికి ఉప ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి అందజేశారు.