భాగ్యనగరంలో జోరుగా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ల సందడి
హైదరాబాద్
భాగ్యనగరంలో మళ్ళీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ల సందడి మొదలైంది. కరోనా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో ప్రముఖ సంస్థలు కొత్త కొత్త డిజైన్లు పరిచయం చేస్తూ నగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాల్ ,కన్వెన్షన్ సెంటర్ లలో తమ బ్రాండ్ ప్రదర్శిస్తున్నాయి.
హైదరాబాద్ తాజ్కృష్ణాలో ఏర్పాటు చేసిన సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ను వర్థమాన నటి రాశీ సింగ్ ప్రారంభించారు.
ఫ్యాషన్ లవర్స్ను ఆకట్టుకునేలా లేటెస్ట్ కలెక్షన్స్ ను అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు ఉమేష్ తెలిపారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.
పెళ్ళిళ్ళు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు బంగారు ఆభరణాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.ఈ సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగనుంది.