సుచిరిండియా ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయానికి నాంది

హైదరాబాద్

సేంద్రియ వ్యవసాయం పై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుచిరిండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సుచిరిండియా కార్యాలయంలో సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచిరిండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో తాము దత్తత తీసుకున్న ‘దేవుని నర్మెట్ట’ గ్రామ రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మరలించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రసాయన ఎరువులు వాడే అలవాటు మార్చటానికి ఏమి చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు కృష్ణ అగ్రో బయో క్యాప్సిల్స్ గురించి తెలుసుకుని ఆ సంస్థ వారితో మాట్లాడి ప్రయోగపూర్వకంగా వంద ఎకరాలకు ఖర్చు భరించి రైతులకు బయో క్యాప్సిల్స్ పంపిణీ చేసి పంట సాగు చేయించామన్నారు.
ఈ బయో క్యాప్సిల్స్ వాడటం వలన చాలామంది రైతులకు పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని, తాలు శాతం బాగా తగ్గిందని.. రైతుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పని చేసినందుకు కృష్ణ అగ్రో బయో క్యాప్సిల్స్ సంస్థ ప్రతినిధులు ను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముందు  కూడా కొనసాగిస్తామని డాక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు. నర్మెట్ట గ్రామ అభివృద్ధిలో భాగంగా పశు నివాస శాల (animal hostel) నిర్మించడం జరిగిందన్నారు. కృష్ణ అగ్రో బయో ప్రొడక్ట్స్ సంస్థ సహకారంతో మున్ముందు పశువుల వ్యర్థాలతో రైతులు తమకు అవసరమైన సేంద్రియ ఎరువులు తామే తయారు చేసుకునేందుకు వీలైన వ్యవస్థను రూపొందించామని డాక్టర్ లయన్ కిరణ్ కుమార్ వెల్లడించారు.

కృష్ణ అగ్రో బయో ప్రొడక్ట్స్ మార్కెటింగ్ హెడ్ సుమన్ మాట్లాడుతూ సుచిరిండియా వారు దత్తత తీసుకున్న దేవుని నర్మెట్ట గ్రామానికి వారి ద్వారా సేవ చేసే అవకాశాన్ని కలిగించినందుకు సుచిరిండియా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాను ఆ గ్రామానికి ఐదుసార్లు వెళ్లడం జరిగిందని, రైతుల చేత ఈ క్యాప్సిల్స్ సరిగ్గా వాడించటం, అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వటం, కోతల సమయంలో కూడా పంట దిగుబడి గమనించటం జరిగిందన్నారు. సుచిరిండియా వారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారని రైతులు చెప్పటం తమకు చాలా ఆనందాన్ని కలిగించిందని అన్నారు.
చౌడు భూమి సమస్యల వలన బాధపడుతున్న కొందరు రైతులు ఈ బయో క్యాప్సిల్స్ వాడటం వలన తమ పొలంలో మొదటిసారి పంటను చూడటం జరిగిందని చెప్పటం తమకు ఆనందం కలిగించిందని సుమన్ అన్నారు. బయో క్యాప్సిల్స్ కొనుగోలు  చేయటానికి రైతులు నేరుగా వారి కాల్  సెంటర్ నంబరు  9121248666 కు కాల్ చేయవచ్చని ఆయన తెలిపారు.

ఈ సదస్సులో పాల్గొన్న రైతులలో  కొంతమంది తమ అనుభవాలను వివరించారు
రైతు నర్సింహులు మాట్లాడుతూ తన చౌడు భూమి లో ఎప్పుడూ ఇంత దిగుబడి చూడలేదనీ, మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరిగాయనీ, భవిష్యత్తులో ఈ బయో క్యాప్సిల్స్ తప్పనిసరిగా వాడతామని చెప్పారు.

రైతు ఋప్పాల రాజు మాట్లాడుతూ తనకు మొత్తం భూమిలో ఒక ఎకరం చౌడు భూమి ఉందని, అందులో  మొక్కలు ఏ రోజూ బతకలేదని… దిగుబడి ఎప్పుడూ రాలేనిలేదని చెప్పారు. ఈసారి ఆ పొలంలో బయో క్యాప్సిల్స్ వాడటం వల్ల మొక్కలు బతికాయని, రానున్న సంవత్సరాలలో ఈ  పొలంలో కూడా దిగుబడి సాధించవచ్చున్న ఆశాభావం వ్యక్తం చేశారు

రైతు మహమ్మద్ రజాక్ మాట్లాడుతూ మొక్కలు బలంగా పెరిగాయని, తాను వేసిన ఒక ఎకరంలో దిగుబడి కనీసం ఐదు బస్తాలు పెరిగిందని హర్షం వ్యక్తపరిచారు.

మాజీ సర్పంచ్ నాలాపురం శ్రీనివాస్ మాట్లాడుతూ నాటు వేసిన తర్వాత అధిక వర్షాలు కురవడం వలన ఊరిలో పంటలు కొద్దిగా పాడయినా బయో క్యాప్సిల్స్ వాడిన తరువాత తన పొలంలో మొక్కలు బాగా ఎదిగాయని దిగుబడి పెరిగిందని  తెలిపారు. ఊరిలో చాలామంది రైతులు  ఈ బయో క్యాప్సిల్స్ వాడటం వలన వచ్చిన ఫలితాలపై ఆనందం వ్యక్తపరిచినట్లు శ్రీనివాస్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *