సికింద్రాబాద్ మల్కాజ్ గిరిలోని మూమెంట్జ్ అకాడమి ఆఫ్ ఫోటోగ్రపీ ఆధ్వర్యంలో యాప్ రూపకల్పన
సికింద్రాబాద్ మల్కాజ్ గిరిలోని మూమెంట్జ్ అకాడమి ఆఫ్ ఫోటోగ్రపీ ఆధ్వర్యంలో యాప్ రూపకల్పన
మూమెంట్జ్ అకాడమి ఆఫ్ ఫోటోగ్రఫీ యాప్ ను లాంచ్ చేసిన షేక్ హుస్సేన్
ఫోటోగ్రఫీ స్కిల్స్ ను ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకునేందుకు యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ అన్నారు.సికింద్రాబాద్ మల్కాజ్ గిరిలోని మూమెంట్జ్ అకాడమి ఆఫ్ ఫోటోగ్రఫీ నిర్వహకులు సవరన్ శ్రమించి ప్రాంతయ భాషలో యాప్ ను తీసుకువచ్చాడన్నారు. అకాడమిలో మూమెంట్స్ ఆఫ్ ఫోటో గ్రఫీ యాప్ ను షేక్ హుస్సేన్ ఆవిష్కరించారు.
ప్రస్తుతం ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ, ఎడిటింగ్ లాంటి కోర్సులకు మంచి డిమాండ్ ఉందని… బయట నేర్చుకోవాలంటే ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుందని షేక్ హుసేన్ అన్నారు . ఆసక్తి ఉన్న వారు ఉచితంగా ఫోటో గ్రఫీ నేర్చుకునేందుకు తెలుగు భాషలో యాప్ ను తీసుకురావడం మంచి విషయమన్నారు. ఏజ్ తో సంబంధంలేకుండా ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగ ఫోటోగ్రఫీ స్కిల్స్ నేర్చుకునేలా ఆన్ లైన్ లో ఉచితంగా నేర్చుకోవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువత ఉచితంగా యాప్ ద్వారా ఫోటోగ్రఫీ కోర్సు నేర్చుకుని ఉపాధి పొందవచ్చన్నారు .
కరోనా పాండమిక్ లో వర్చువల్ ఎడ్యుకేషన్ కు క్రేజీ పెరిగిందని… ఫోటోగ్రఫీని సైతం ఆన్ లైన్ లోకి తీసుకువచ్చామని మూమెంట్స్ ఫోటో గ్రఫీ అకాడమి నిర్వహకులు సరవన్ అన్నారు.ఈ యాప్ ద్వారా తెలుగులో ఫోటోగ్రఫీ స్కిల్స్ సులువుగా నేర్చుకోవచ్చని తెలిపారు .