ఇమెయిల్‌ అపాయింట్‌మెంట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన పదేళ్ల చిన్నారి

మహారాష్ట్ర ఎంపీ సుజయ్ విఖే పాటిల్ కుమార్తె అనిషా పాటిల్ తాను ప్రధాని నరేంద్ర మోడీని కలపాలని తండ్రిని కోరేది .అయితే ప్రధానినికలవడం అంత సులభమైన పని కాదని తండ్రి చెబుతూ వచ్చేవారు. దీంతో ఈ తెలివైన ఈ అమ్మాయి తన తండ్రి ల్యాప్‌టాప్‌ లో లాగిన్ అయ్యి “హలో సర్ నేను అనిషా నిజంగా వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని ప్రధానికి మెయిల్ పంపింది.

ఇది గమనించిన ప్రధాని ‘దౌడ్ కే చలే ఆవో బెటా’ ( పెరుగెత్తుకొంటూ రా బిడ్డా) అంటూ స్పందించారు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న అనిషా పాటిల్ తన కుటుంబంతో పార్లమెంటులో అడుగుపెట్టింది. మోదీ గారిని కలిసిన ఆనందలో ఆ చిన్నారి ఇది మీ కార్యాలయమా? ఎంత పెద్దదిగా ఉన్నది. మీరు రోజంతా ఇక్కడ కూర్చుంటారు? అంటూ వరస ప్రశ్నలను సంధించింది. పిల్లల సహవాసాన్ని ఆస్వాదించే ప్రధాని ఆ బాలిక ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చారు.
ఇలా ప్రధాని పార్లమెంట్ సమావేశాలు ,ఇతర బిజీ షెడ్యూల్‌లో కూడా చిన్నారిని కలిసేందుకు సమయం ఇవ్వడం అందరిని అశ్చర్యనికి గురిచేసంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *