అత్యవసర మరమ్మత్తుల కోసం వారం రోజుల పాటు రోడ్ కం రైల్వే బ్రిడ్జి తాత్కాలికంగా మూసివేత :జిల్లా కలెక్టర్ డా కె . మాధవీలత
ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బ్యారేజ్, 4 వ వంతెన మీదుగా ట్రాఫిక్ మళ్లింపు
జిల్లాలోని ప్రధాన రహదారి మార్గం అయిన గోదావరీ రోడ్ కం రైల్వే బ్రిడ్జి అత్యవసర మరమ్మత్తుల నిమిత్తం అక్టోబర్ 14 (శుక్రవారం) నుంచి వారం రోజుల పాటు మూసి ఉంచడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
సదరు రోడ్ కం రైల్వే వంతెన కు సంబందించిన అత్యవసర మరమ్మత్తు పనులను రహదారులు, రైల్వే శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న దృష్ట్యా పోలీసు వారిచే సూచించిన ప్రత్న్యన్మయ మార్గాలలో కొవ్వూరు – రాజమహేంద్రవరం మధ్య ప్రయాణాలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసి బస్సు లకు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా..లారీలు, ఇతర భారీ వాహానాల ట్రాఫిక్ 4 వ వంతెన మీదుగా మళ్లింపు
అందులో భాగంగా ద్విచక్ర వాహన దారులు, నాలుగు చక్రాల వాహనాలు, ఆర్టీసి బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా ట్రాఫిక్ మళ్ళించడం జరుగుతోందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు . లారీ లు, భారీ వాహనాలు, ప్రవేటు బస్సులు, కమర్షియల్ వాహనాల యొక్క ట్రాఫిక్ ను కొవ్వూరు – రాజమహేంద్రవరం నాల్గవ వంతెన మీదుగా అనుమతించడం జరుగుతుందని పోలీసులు తెలియచేశారు. వాహనదారులు సహకరించి ట్రాఫిక్ మళ్లింపు కు సంబందించిన నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.