తెలుగు ఓటీటీ సంస్థ ఆహా .. తరగతి గది దాటి వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌ మీట్

తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది .

ఇప్పటికే ఆహా వేదికగా తరగతి గది దాటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆహా అనిపించింది.

తరగతి గది దాటి సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని ఫోరం సుజనా మాల్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తరగతి గది దాటి నటి నటులు హీరో హర్షిత్ రెడ్డి, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ
, ఎస్ ఆర్ కల్యాణమండపం హీరో కిరణ్ అబ్బవరంతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తాజాగా థియేటర్లలో విడుదలై వెండితెరపై మంచి విజయాన్ని అందుకున్న ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా త్వరలో నే ఆహా…ప్రేక్షకులను అలరించినుంది. ఎస్ ఆర్ కళ్యాణ మండపం హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ త్వరలో ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ కూడా ఆహా ద్వారా రానుంది అని తెలిపారు. వరుసగా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ షో ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం తో ఆహా  ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు.

ఆహా త్వరలో కిడ్స్ ని కూడా అలరిచేందుకు కిడ్స్ ఒరిజినల్ షోల తో మన కథలు మన విలువలు పోగ్రామ్స్ మరి కొన్ని పోగ్రామ్స్ తో ఆహా మీ ముందుకు రానుంది.

ఆహా లో ఇప్పటికే ఉన్న వెబ్ సిరీస్ మరియు సినిమాలు – లెవ‌న్త్ అవ‌ర్‌, క్రాక్‌, జాంబి రెడ్డి, నాంది, సుల్తాన్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌, వెబ్ షోస్ మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా మెప్పిస్తాయి. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు, షోలతో మరింత వినోదం అందివ్వనుంది ఆహా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *