మద్యం విక్రయాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డు.. అట్లుంటది మనతోని..!
తెలంగాణలో మద్యం కిక్కు అసలు తగ్గడం లేదు. ప్రతీ ఏడాదిలాగే గత ఏడాది కూడా లిక్కర్ కిక్కు ఏ మాత్రం తగ్గలేదు. మద్యం అమ్మకాల్లో ఆల్ టైం రికార్డులు సృష్టిస్తూనే ఉంది. మందు మంచినీళ్లలా తాగేస్తున్నారు మనోళ్లు. 2021 ఏడాది కంటే గత ఏడాది మద్యం అమ్మకాలు మరింతగా పెరిగాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తెలంగాణవ్యాప్తంగా మొత్తం 34వేల 352 కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 2021తో పోలిస్తే ఇది దాదాపు డబుల్ అని చెప్పుకోవచ్చు. 2021లో 18 వేల 868 కోట్ల అమ్మకాలు జరిగితే.. 2020లో మొత్తం కలిపి 16వేల 254 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2021లో 2.73 కోట్ల లిక్కర్, 2.45 కోట్ల బీర్ కేసులు విక్రయించగా… గత ఏడాది 3.5 కోట్ల లిక్కర్, 4.5 కోట్ల కేసుల బీర్లు అమ్మాడయ్యాయి. ఇక 2022 డిసెంబర్ నెలలో 3వేల 376 కోట్ల మద్యం అమ్ముడుపోగా.. 2021 డిసెంబర్‌లో 2వేల 901 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2021 ఏడాది కంటే గత ఏడాది డిసెంబర్‌లో అదనంగా 475 కోట్లు పెరిగింది.
