ఛాయ్ పెట్టు లక్ష పట్టు …హై బిజ్ టీవీ ఆధ్వర్యంలో తెలంగాణ టీ ఛాంపియన్ షిప్ పోటీలు
హైదరాబాద్ ,కొండాపూర్
రుచికరమైన ఛాయ్ కు రూ. లక్ష బహుమతి
మహిళలకు మాత్రమే టీటీసీలో పాల్గొనే అవకాశం
తెలంగాణలో ఇలాంటి పోటీ జరగడం ఇదే తొలిసారి
హైదరాబాద్, ఫిబ్రవరి-2022:
అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని మహిళలకు సముచిత గౌరవం ఇచ్చేందుకు హై బిజ్ టీవీ వినూత్నంగా ఛాయ్ పెట్టు లక్ష పట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు మార్చి ఆరవ తేదీన హైదరాబాద్ నోవాటెల్ లో తెలంగాణ టీ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు హై బిజ్ టీవీ ఎండీ మాడిశెట్టి రాజగోపాల్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న మహిళలు హైబిజ్ టీవీ డాట్ కాంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని…ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజులు లేవని తెలిపారు.. “ పోటీకి హాజరై రుచికరమైన ఛాయ్ ని తయారు చేసిన వారిలో నలుగురిని జడ్జిలు ఎంపిక చేస్తారు. అందులో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన వారికి లక్ష రూపాయలు అందజేస్తాం. సెకండ్ ప్రైజ్ గా రూ. 50 వేలు అందిస్తాం. మొదటి, రెండో రన్నరప్ కు రూ. 25 వేల రివార్డు ఉంటుంది” అని మాడిశెట్టి రాజ్ గోపాల్ వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు ఫిబ్రవరి 28 వ తేదీలోగా తమ ఎంట్రీలను నమోదు చేసుకోవాలన్నారు .ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మార్చి ఏడవ తేదీన గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్ లో ఉమెన్ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామన్నారు .
ఈ కార్యక్రమంలో కేఫ్ నీలోఫర్ డైరెక్టర్ శ్రీజ, గోద్రెజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి , హెచ్ఐసీసీ నోవాటెల్ జనరల్ మేనేజర్ మనీశ్ దయా హైబిజ్ టీవీ సీఈఓ డాక్టర్ జె. సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.