స్టార్ మహిళ కబడ్డీ హల్ చల్” లోగో ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్
గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్పొరేట్ సంస్థలు సైతం ముందుకు రావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ VBR డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “స్టార్ మహిళ కబడ్డీ హల్ చల్” లోగో ను హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎంతో ప్రాచీన క్రీడ కబడ్డీ ని ప్రోత్సాహించాలనే సంకల్పంతో GHMC మహిళ కార్పొరేటర్లు , ప్రముఖ TV మహిళ ఆర్టిస్టులు, జానపద మహిళ కళాకారిణి లు, సామాజిక మాధ్యమాల్లో ని ప్రముఖ మహిళ ల చే నిర్వహిస్తున్న ‘స్టార్ మహిళ కబడ్డీ హల్ చల్’ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కబడ్డీ తో పాటు ఇతర ఇండోర్ గేమ్స్ ను ఆడుతూ తమ ఫిట్ నెస్ ను పెంపొందించుకునే వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా మహిళ లను అన్ని రంగాల్లో, క్రీడా విభాగాల్లో ప్రోత్సాహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కబడ్డీ హల్ చల్ నిర్వహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ రియల్ స్టేజి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమాదిత్య రెడ్డి, ఉపాధ్యక్షురాలు యాట నవీన, గౌరవ సలహాదారు విజయ లక్ష్మి, కోశాధికారి, ప్రముఖ నటి శ్రీ వాణి, VBR డవలపర్స్ MD రవి, తదితరులు పాల్గొన్నారు.