ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తిహీరాబెన్ మృతి పట్ల తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం
హైదరాబాద్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్ధించారు. కన్న తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రధాని మోడీకి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వంద సంవత్సరాల వయస్సున్న హీరాబెన్ సంపూర్ణ జీవితం గడిపారని, మోడీ లాంటి గొప్ప నాయకుడిని దేశానికి అందించారని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. కొడుకు దేశ ప్రధాన మంత్రి హోదాలో ఉన్నా హీరాబెన్ ఆడంబరాలకు దూరంగా అతి సామన్య జీవితం గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ప్రధానిగా దేశ సేవలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోడీ తల్లి హీరాబెన్ కు సమయం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసుకునేవారని, పండుగలకు తల్లి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకునేవారని తెలిపారు. కొడుకు మోడీ అంటే హీరాబెన్ కు కూడా అమిత ప్రేమ ఉండేదని, అలాంటి మాతృ మూర్తి మరణం బాధాకరమని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.