జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ శుభారంభం

లక్నో

జాతీయ బాలికల జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది.

తొలి మ్యాచ్‌లో తెలంగాణ 14-4తో అస్సోంపై గెలుపొందింది. లక్నోలో జరుగుతున్న ఈ పోటీలను బుధవారం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్‌.కే తివారీ, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌ మోహన్‌రావు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్‌ మోహన్‌రావు మాట్లాడుతూ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సహకారంతో ఒక మంచి వాతావరణంలో ఈ పోటీలను నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు.

కొవిడ్‌తో స్తంభించిపోయిన క్రీడా పోటీలను అన్ని జాగ్రత్తలు తీసుకొని పునర్‌ ప్రారంభించామన్నారు . ఈ చాంపియన్‌షిప్‌లో వివిధ రాష్ట్రాల‌కు చెందిన 24 టీమ్‌లు, అండర్‌-19 విభాగానికి చెందిన దాదాపు 600 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 12తో పోటీలు ముగిస్తాయని.. క్రీడాకారులందరూ శక్తి మేరకు రాణించి స‌త్తా చాటాల‌ని జగన్‌ మోహన్‌రావు సూచించారు. ప్రారంభోత్సవంలో ఐఓఏ కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండే, ఉత్తరప్రదేశ్‌ క్రీడల ప్రిన్సిపల్‌ సెక్రటరీ కల్పన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *