హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ దళితుల్ని అభ్యర్థిగా నిలబెట్టాలి : తెలంగాణ లోక్ జనశక్తి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ భీంరావు డి

సీఎం కేసీఆర్‌కు దళితుల పట్ల ప్రేమ ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల టికెట్‌ను దళితులకు ఇవ్వాలని తెలంగాణ లోక్ జనశక్తి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ భీంరావు డిమాండ్ చేశారు . హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రామ్‌విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా దళిత సాధికారికత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళితులకు కేటాయించిన ఎస్టీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సీఎం కేసీఆర్ పక్కదారిపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులను అణగదొక్కే ప్రయత్నం కొంతమంది రాజకీయ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు దళిత సంఘాల నేతలు.దళితులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని,రామ్ విలాస్ పాశ్వాన్ ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు . హైదరాబాద్
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా దళిత సాధికారికత అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ లోక్ జనశక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భీమరావు,గొల్లపల్లి దయానంద రావు, తదితర దళిత మేధావులు పాల్గొన్నారు.దళితుల మధ్య మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఉన్నత వర్గాల వాళ్ళు వెనుకకు నెట్టి ఉన్నారని వక్తలు తెలిపారు.
సీఎం కేసీఆర్ దళిత సాధికారత పేరుతో మరోసారి మోసం చేయడానికి ముందుకు వచ్చాడని మండిపడ్డారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు భీమ్ రావు చెప్పారు. దళితుల సాధికారత సాధించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులలో ఉద్యమ కాంక్ష తో పాటు రాజ్యాధికారం దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *