హైదరాబాద్ లో లుజోబాక్స్ కియోస్క్ ను ప్రారంభించిన తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్

ప్రపంచవ్యాప్తంగా బ్యూటి పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభుత్వ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటుచేసిన లూజోబాక్స్ కియాస్క్ లోగోను తెలంగాణ ఐటి సెక్రెటరీ జయేష్ రంజన్ ఆవిష్కరించారు.

యువ మహిళా పారిశ్రామిక వేత్తలు అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో ఈ కామర్స్ బిజినెస్ జోరుగా సాగుతుందన్నారు.

లుజొ బాక్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను హైదరాబాదీలకు పరిచయం చేసేందుకు నిర్వహించిన ఫ్యాషన్ షో అందరినీ అలరించింది. హైదరాబాదీ మోడల్స్ తమ అందచందాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన క్యాట్ వాక్ కలర్ ఫుల్ గా సాగింది.

లుజో బాక్స్ సహ వ్యవస్థాపకులు స్వప్న బొజ్జా మాట్లాడుతూ, సౌందర్య సాధనాల కోసం ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్న లూజో బాక్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను హైదరాబాదీయులకు అందించేందుకు కియాస్క్ ను అందుబాటులో ఉం చామన్నారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన బ్యూటీ కాస్మోటిక్ ఉత్పత్తులను దేశీయ మార్కెట్ లోని వినియోగదారులకు అందించాలనే ఉద్దేశ్యం తో ఈ కియోస్క్ ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. రానున్న ఆరు నెలల్లో ప్రధాన నగరాలైన కోల్ కత్తా, ధీల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబాయ్ వంటి ప్రాంతాల్లో అరవై కి పైగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులు తమకు కావాల్సిన పలు దేశాల బ్రాండ్లైన హెయిర్, ఫేస్, బాడీ కేర్, కలర్ కాస్మోటిక్స్ ఈ లుజోబాక్స్ ద్వారా పొందవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభుత్వ కార్యదర్శి జయేశ్ రంజన్, నటుడు విశ్వక్ సేన్, టాలీవుడ్ నటి శ్రీదేవి విజయ్ కుమార్, నిత్యా నరేష్, నిత్య శెట్టి, బిగ్ బాస్ ఫేమ్ దివి సంస్ధ సిఇఓ అండ్ ఫౌండర్ అమిత్ గిరి, డైరెక్టర్ స్టాటర్జీ అండ్ ఇన్నోవేషన్స్ భాను రెడ్డి వరాల, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *