ఒలంపిక్స్ క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించిన రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
ఒలింపిక్స్ క్రీడల్లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్హం వ్యక్తం చేశారు. రవికుమార్ కు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణ పతకం తృటిలో చేజారిపోయినా, అత్యంత ప్రతిభకనబరిచి ఫైనల్ దాకా చేరుకుని రజతాన్ని సాధించిన రవికుమార్ క్రీడాస్పూర్తి దేశకీర్తిని మరింత ఇనుమడింపచేసిందని సిఎం అన్నారు. విశ్వక్రీడల్లో భారత క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధించడం సంతోషంగా వుందని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు.