సీఎం కేసీఆర్ విధానాలతో ధాన్యం సేకరణలో అల్ టైం రికార్డ్ సాధించిన తెలంగాణ : పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

ధాన్యం సేకరణలో ఉమ్మడి రాష్ట్రాన్ని మించి దేశంలో మూడో స్థానం తెలంగాణదే

కరోనా, కేంద్రం ప్రతికూల పరిస్థితులను అధిగమించి ధాన్యం సేకరణ

కేంద్ర లక్ష్యాన్ని మించి 70.30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ

12,87,029 మంది రైతుల నుండి సేకరణ

13,757 కోట్ల రూపాయల్ని రైతులకు అందించిన తెలంగాణ

వారం వ్యవదిలోగా రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ

కరోనా కాలంలో అత్యదికంగా 6872 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

విజయవంతం చేసిన సిబ్బందికి అభినందనలు

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి

హైద‌రాబాద్

ధాన్యం సేకరణలో తెలంగాణ ఆల్ టైం రికార్డు స్రుష్టించింది, సీఎం కేసీఆర్ రైతు అనుకూల విదానాలతో ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నధాతలు సిరుల పంటను పండించారు. వానాకాలంలో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకొని ఇప్పటివరకూ లేనంతగా అత్యధికంగా 70.30 లక్షల మెట్రిక్ టన్నుల్ని సేకరించామన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు సందర్భంగా వివరాల్ని వెల్లడించారు.

2014-15 సంవత్సరం వానాకాలంలో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ధాన్యం సేకరణ, 15-16లో 15.13, 16-17లో 16.52, 17-18లో 18.27, 18-19లో 40.43, 19-20లో 47.09, 20-21లో 48.75 లక్షల క్వింటాళ్ల సేకరణతో దిన దినం తెలంగాణ అభివ్రుద్ది చెందుతోందని ఈ సంవత్సరం 70.30 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఉమ్మడి రాష్ట్రాన్ని మించి వానాకాలంలో సేకరించామన్నారు మంత్రి గంగుల కమలాకర్. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6,86,160 మెట్రిక్ టన్నులు, అత్యల్పంగా ఆధిలాబాద్లో 2468 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.

ఈ వానాకాలం ధాన్యం సేకరణలో దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో తెలంగాణ నిలించిందన్నారు. కరోనా వంటి గడ్డు పరిస్థితులకు తోడు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ప్రతికూల పరిస్థితులను స్రుష్టించినా సీఎం కేసీఆర్ సంకల్పంతో చివరి గింజ వరకూ ధాన్యం కొన్నామన్నారు. రైతులకు ముఖ్యమంత్రిగారు ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు, కరోనా నిబందనలతో అత్యధికంగా 6872 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని, 12,87,029 మంది రైతుల వద్దనుండి 13,757 కోట్ల రూపాయల విలువగల 70.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు గంగుల, ఓపిఎంఎస్లో నమోదైన వారంలోపే రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసామన్నారు, అకాల వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ఈ వానాకాలం తొలుత 40 లక్షల క్వింటాళ్ల బియ్యానికి తర్వాత సీఎం కేసీఆర్ గారి ఒత్తిడితో మరో 6 లక్షల క్వింటాళ్ల బియ్యానికి అనుమతి ఇచ్చిన కేంద్ర లక్ష్యాన్ని మించి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అధికంగా సేకరించామన్నారు. దీనికి సంబందించిన సీఎంఆర్ ప్రక్రియ సైతం వేగంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 18శాతంతో దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్.సి.ఐ కు అందించడమే కాకుండా రోజుకు 20వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తున్నామన్నారు. ధాన్యం సేకరణపై ఈ ఘనత సాధించడంలో తోడ్పడిన ఐకేపి, కోఆపరేటివ్ సోసైటీస్, పౌరసరపరాల సిబ్బందితో పాటు పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *