టీడీపీ, వైసీపీ ,జనసేన పార్టీలను పొలిమేరల నుంచి తరిమికొట్టాలి
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి
విజయవాడ :
ప్రజలకు శని గ్రహం లా దాపురించిన ఈ ప్రాంతీయ పార్టీ లను ఆంధ్ర ప్రదేశ్ పొలిమేరల నుంచి తరిమికొట్టాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. విభజన చట్టంలో రావాల్సిన రో.5 లక్షల కోట్ల విలువ చేసే ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సాయం, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే, తెచ్చే శక్తి ఈ పార్టీ లకు లేదని విమర్శించారు.
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ని, ముగ్గురూ మోడీ చేతిలో కీలు బొమ్మలు గా మారారని ధ్వజమెత్తారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని, 2024లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు.