రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టీడీపీ కి అండగా నిలవాలి : చంద్రబాబు

అమరావతి

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదుపై రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం వాట్సప్​ నెంబర్​ ప్రకటించారు.

టీడీపీ సభ్యత్వ నమోదు.. ప్రారంభించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.సభ్యత్వ నమోదుపై రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. ఉండవల్లి గ్రామ పార్టీ నేతల ద్వారా చంద్రబాబు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వాట్స్ యాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ ద్వారా సభ్యత్వం పొందే అవకాశం కల్పించారు. చంద్రబాబు పార్టీకి ఆన్​లైన్​లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. వేదికపైనే అచ్చెన్నాయుడు, నారా లోకేశ్​లు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఆన్​లైన్​లో సభ్యత్వ నమోదు చేపట్టారు. 100 రూపాయలు చెల్లింపు ద్వారా పార్టీ సభ్యత్వం పొందే అవకాశమిచ్చారు. సభ్యత్వం కార్డు పొందిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *