గ్రామ స్థాయి నుంచి టీడీపీని బలోపేతం చేయాలి: టీటీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు
హైదరాబాద్ ,బంజారాహిల్స్
తెలంగాణలో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని… బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని టీటీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చేవేళ్ల పార్లమెంట్ విసృత స్ధాయి సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు గుడెం సుబాష్ యాదవ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నరసింహులు , పోలిట్ బ్యురో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి , జాతీయ ఉపాధ్యక్షులు చిలువెరు కాశీనాధ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ వ్యక్తుల బలోపేతం కంటే సంస్థను బలోపేతం చేసుకోవాల్సిన అసవరం ఉందన్నారు . యువతకు తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించాల్సిన అవసరం మన అందరి బాధ్యత అన్నారు . ప్రతి కార్యకర్త కొంత సమయం పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కేటాయించాలని కోరారు .
ప్రజా సమస్యలపై కార్యచరణ రూపొందించి ప్రతి ఒక్కరు వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టలని కోరారు. స్ధానికంగా గ్రామ స్ధాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ కమిటీలను, మండల కమిటిలను త్వరిత గతిన పూర్తి చేసి గ్రామ స్ధాయి నుండి, జెండా పండుగాను నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు .నందమూరి సుహాసిని , సామా భూపాల్ రెడ్డి , రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిలు .ఆజ్మీరా రాజు నాయక్ , గడ్డి పద్మావతి , షేక్.ఆరీఫ్ , రాష్ట్ర పార్టీ కార్యనిర్వహాక కార్యదర్శి .ధన లక్ష్మీ, వెంకట్ రెడ్డి , తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు .పొగాకు జైరామ్ చందర్ , ఎస్.సి-సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొలంపల్లి అశోక్ , ఎస్.సి-సెల్ ప్రధాన కార్యదర్శి గూడెపు రాఘవులు , .సంధ్యపోగు రాజ శేఖర్ , చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.