తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయడు
హైదరాబాద్ , బంజారాహిల్స్
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు .ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటి వరకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడంతో పాటు జాతీయ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. కాసాని జ్ఞానేశ్వర్ ఈనెల 10 వ తేదీన భారీ బహిరంగ సభలో తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తమ వంతుయత్నిస్తానని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు .