టాటా మోటార్స్ నుంచి సరికొత్త డార్క్ ఎడిషన్ మోడల్స్ ఆవిష్కరణ
హైదరాబాద్ గచ్చిబౌలిలోని టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్ డీలర్స్ వెంకటరమణ మోటార్స్ షోరూమ్‌లో టాటామోటార్స్ నూతన డార్క్ ఎడిషన్ కార్స్ ఆవిష్కృతమయ్యాయి.ఈ కొత్త మోడల్స్ ను వెంకటరమణ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి.వి రాజేంద్రప్రసాద్ మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా టాటా వెంకటరమణ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..
టాటా మోటార్స్ భారతదేశంలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు డార్క్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసిందనన్నారు. టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్, టాటా నెక్సాన్ ఇవి డార్క్ ఎడిషన్, టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్,టాటా హారియర్ డార్క్ ఎడిషన్ మోడల్స్ ను విడుదల చేసింది.ఈ కొత్త డార్క్ ఎడిషన్ మోడల్స్ అన్ని టాటా వెంకటరమణ డీలర్‌షిప్‌లలో బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త నాలుగు డార్క్ ఎడిషన్ మోడల్స్ అన్నీ కూడా exterior , ఇంటీరియర్ లో సరికొత్త మార్పులతో మరోసారి మార్కెట్లోకి విడుదలయ్యాయని ఆయన తెలిపారు.
ఇంటీరియర్ లోనూ నూతన బ్లాక్ థీమ్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. వీటి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి..
హారియర్ ఎక్స్ టీ డార్క్ ఎడిషన్ 18 లక్షల 4,400 రూపాయలు . nexon xz plus dark edition ఎక్స్ షోరూం ప్రైస్ 11 లక్షల 73 వేల 900 రూపాయలు ,ఆల్ట్రోజ్ ఎక్స్ జెడ్ ప్లస్ డార్క్ ఎడిషన్ ఎక్స్ షోరూం ప్రైస్ 8 లక్షల 70 వేల 900 రూపాయలు,ఇక నెక్సాన్ ఈ.వీ డార్క్ ఎడిషన్ ఎక్స్ షోరూం ప్రైస్ 15 లక్షల 99 వేల రూపాయలు గా నిర్ణయించారు. ఎక్స్ షోరూం ప్రైజ్ తో అన్ని టాటా వెంకటరమణ డీలర్ షిప్ షోరూంలలో అందుబాటులో ఉన్నాయని రాజేంద్రప్రసాద్ తెలిపారు.