హైదరాబాద్ కొంపల్లిలో వెంకట సాయి మోటార్స్ భాగస్వామ్యంతో టాటా హిటాచీ షోరూం ప్రారంభం

హైదరాబాద్,కొంపల్లి

తెలంగాణలో టాటా హిటాచీ  విక్రయాల కోసం వెంకట సాయి మోటార్స్ తో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ అన్నారు .హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలోని వెంకట సాయి మోటార్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన టాటా హిటాచీ షోరూంను ఆయన ప్రారంభించారు.దేశంలోనే మొట్టమొదటి సారిగా  టాటా హిటాచీకి చెందిన కాంపక్ట్ పరికరాల అందించేందుకు వెంకట సాయి మోటార్స్ తో భాగస్వామ్యం అయ్యామని ఆయన తెలిపారు.

దేశంలోనే మొదటి సారిగా మన హైదరాబాద్ నుంచి పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంబించడం జరిగిందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ అన్నారు .తెలంగాణలో పారిశ్రామిక రంగం, వ్యవసాయరంగం,పట్టణ అభివఈద్ది, రియల్ ఎస్టేట్, గ్యాస్ పైప్ లైన్ ,ఆప్టికల్ ఫైబర్ లైన్లు, ఘన వ్యర్థాలు నిర్వహణ, ఫ్లాంటేషన్ ,గ్రామీణ రోడ్లు తదితర రంగాల్లో వేగంగా దూసుకుపోతుందన్నారు.
ఆయా రంగాల అవసరాలకు తగ్గట్టుగా టాటా హిటాచీలను, పరికరాలను, మెకానిజంను  అందుబాటులో ఉంచామన్నారు .వినియోగదారులకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు ఈ షోరూం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ట్రాక్టర్లు, టూవీలర్లు, త్రీవీలర్లు, హార్వెస్టర్ లతో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన వెంకట సాయి మోటార్స్ 24 సంవత్సరాల అనుభవంతో టాటా హిటాచీతో భాగస్వామ్యం అయ్యామని వెంకటసాయి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో టాటా హిటాచీ  అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని… కస్టమర్లకు కావాల్సిన సౌకర్యాలు అందించేందుకు ఈ షోరూం దోహదపడుతుందన్నారు.

 ఆరు దశాబ్దాలుగా టాటా హిటాచీ కాంపాక్ట్ పరికరాలు, లార్డ్ ,వీల్ లోడర్, బ్యాక్ హోల్డర్లు, ట్రక్కులు, ఇన్ఫ్రా స్ట్రక్చర్ యంత్రాలు అందిస్తుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ఈ యంత్రాలు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయని… అత్యంత విశ్వసనీయతతో పరికరాలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తమ భారతీయ ఫీచర్లులతో కస్టమైజేషన్ లతో కస్టమర్లకు అందించామని  సందీప్ సింగ్ అన్నారు. టాటా హిటాచీ పరికరాల కోసం వెంకట సాయి మోటార్స్ తో మా భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. చలో దేష్ బానాయే అనే నినాదంతో దేశ నిర్మాణానికి ఈ భాగస్వామ్యం మరింత సహకారాన్ని అందిస్తుంది అని సింగ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో టాటా హిటాచీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ , వెంకట సాయి షోరూం మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్  అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్  రామ్ అయ్యర్, నేషనల్ హెడ్ కన్స్ట్రక్షన్   రాహుల్, రీజినల్ వర్టికల్ హెడ్  బాలాజీ, తెలంగాణ హెడ్ కళ్యాణ సుధాకర్, ఏరియా మేనేజర్   మనోజ్ సాయి నారాయణ ,షోరూం సిబ్బంది పాల్గొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *