నంద్యాల జిల్లా సీఎం పర్యటన ఏర్పాట్లకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి:జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
ఈ నెల 17 వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో హెలిప్యాడ్ ప్లాట్ఫామ్ తయారీ, చుట్టారా బారీకేడింగ్ శుక్రవారం సాయంత్రం లోగా పూర్తి చేయాలన్నారు. వెలుపల భాగంలో రోడ్డు కిరువైపులా ఫ్లవర్ డెకరేషన్ చేయించాలని ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు. హెలిపాడ్ నుండి సభా ప్రాంగణం వరకు 1.2 కి.మీ రహదారి పొడవునా ఇరువైపులా ఐరన్ బారీకేడింగ్ తో పాటు రోడ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ ను ఆదేశించారు. సభ వేదికపై ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని నంద్యాల ఆర్డిఓను సూచించారు. సభా ప్రాంగణానికి అంతరాయం లేకుండా విఐపిలు, అధికారుల వాహనాలు గుర్తించిన పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుదల చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాతో పాటు పంట ఉత్పత్తులకు సంబంధించిన నోట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని కలెక్టర్ ఆదేశించారు
జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు వివిధ స్థాయిల పోలీస్ అధికారులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అధికారులు, పోలీసులు పరస్పర సహకారంతో సీఎం పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఇన్చార్జి డిఆర్ఓ మల్లికార్జునుడు, ఆర్డీఓలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, ఏం దాసు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.