వాలంటైన్స్ డే రోజున హైదరాబాద్ తాజ్ కృష్ణాలో సూత్రా లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్ బంజారాహిల్స్
వాలంటైన్స్ డేను పురస్కరించుకు సూత్రా లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక కలెక్షన్స్ అందుబాటులో ఉంచనున్నట్లు సినీ నటి రిథిక చక్రబర్తి అన్నారు . హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు . దేశంలోని ప్రముఖ డిజైన్లు తమ సృజనాత్మకతతో రూపొందించిన వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్ లో కొలువుదీరనున్నాయి.
ఈ ప్రదర్శనలో SUTRAA క్రియేటివ్ ఫ్యాషన్ వేర్, లైఫ్‌స్టైల్ & డిజైనర్ వేర్, జ్యువెలరీ, యాక్సెసరీస్ ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్ అందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు . మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ లో ఫ్యాషన్, గ్లామర్, స్టైల్‌కి సంబంధించిన పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు . ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది .
మోడల్స్ లెహంగాస్ ధరించి చేసిన క్యాట్ వాక్ అదుర్స్ అనిపించింది.