ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ రన్నరప్‌గా సుశాంత్
ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ రన్నరప్‌గా సుశాంత్
హైదరాబాద్,యూసూఫ్ గూడ,సెప్టెంబర్ 1.
ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో తెలంగాణ క్రీడాకారుడు కె.సుశాంత్ రన్నరప్ గా నిలిచాడు. హైదరాబాద్ యూసూఫ్ గూడ స్టేడియంలో జాతీయ,రాష్ట్ర చెస్ సంఘాల సహకారంతో ఏకాగ్ర చెస్ అకాడమి ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 10 లక్షల రూపాయలు, టోర్నీ విజేత గా న్యూఢిల్లీ క్రిడాకారుడు అక్షిత్ నేగి లక్ష గెలుచుకోగా రన్నరప్ సుశాంత్‌కు 70 వేలు నగదు బహుమతి లభించింది. హరియాణాకు చెందిన సాహిల్ బెహ్రాన్ తృతీయ స్థానం దక్కించుకున్నాడు.అలెన్ బారీ గ్యాస్ ఇండస్ట్రీస్ డైరెక్టెర్ వరుణ్ అగర్వాల్, తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు కెఎస్ ప్రసాద్, ఎకాగ్ర చెస్ అకాడమీ సీఈఓ సందీప్ నాయుడు, సెంట్రో ఎండీ శ్రీధర్ కలిసి విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు.