మోకిలలో చక్రసిద్ధ్ ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించిన సినీ నటుడు మహేష్ బాబు ,నమ్రత

హైదరాబాద్

దీర్ఘకాలిక రోగాలు నయం చేసేందుకు మన ప్రాచీన వైద్యం ఎంతగానో దోహదపడుతుందని సినీ నటుడు మహేష్ బాబు అన్నారు. హైదరాబాద్ శంకర్ పల్లి సమీపంలోని మోకిలలో నూతనంగా ఏర్పాటు చేసిన చక్రసిధ్ వైద్య శాలను  సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతతో కలిసి ప్రారంభించారు.  నయం చేయలేని వ్యాధుల నుండి ఉపశమనం కలిగించేందుకు ఈ చక్రసిధ్ వైద్యం దోహదపడుతుందన్నారు.

దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి చేయడానికి  సిద్ద వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. యోగ, సిద్ధ ,హీలింగ్, 4000 సంవత్సరాల పురాతనమైనవని.. మానవ ఉనికి యొక్క భౌతిక, ఆధ్యాత్మిక , మానసిక అంశాలలో స్థిరమైన సమతుల్యతను వెలిగిస్తుంది అని ఆమె అన్నారు.  .

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ అరుదైన చికిత్సా పద్ధతిని అందించే కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు.  ఇది కేవలం వ్యాధిని నయం చేసే పద్ధతి మాత్రమే కాదని..మన మొత్తం జీవనశైలిని మార్చడంలో ఇది సహాయపడుతుందన్నారు.

డాక్టర్ సత్య సింధుజ చక్ర సిద్ధ   వైద్యంలో నిపుణురాలని  ఈ రకమైన చికిత్సలో నిపుణురాలుగా  ఉన్న ఏకైక వ్యక్తి సింధుజ అని మహేష్ బాబు అన్నారు.  మైగ్రేన్,  కొన్ని కండరాల వ్యాధులను నయం చేయచేయగల సత్తా చక్ర సిద్దకు ఉందన్నారు.  డా. సింధుజ సూచనలు , పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలు చూడవచ్చని తెలిపారు. ప్రామాణికమైన, ప్రాచీనమైన మరియు సాంప్రదాయ చికిత్సను ప్రోత్సహించడం నాకు చాలా సంతోషంగా ఉందని మహేష్ బాబు అన్నారు.

మానవ శరీరంలో 72,000 శక్తి మార్గాలు ఉన్నాయని..  ప్రెజర్ పాయింట్ల ద్వారా శక్తి ప్రవాహాన్ని పరీక్షించడం దీర్ఘకాలిక నొప్పి మరియు వ్యాధులను నయం చేయడం  జరుగుతుందని సత్య సింధూర అన్నారు . ఇదే రకమైన చికిత్స, మరే ఇతర దేశంలోనైనా అందించబడితే, వారు దీనికి మరింత  ప్రాముఖ్యతనిచ్చేవారని ఆమె తెలిపారు .

భారతీయ సాంప్రదాయ, ప్రాచీన వైద్యంకు ప్రజల్లో  రోజు రోజుకు అసక్తి పెరుగుతుందని చికిత్స  నటి నమ్రత అన్నారు.  డాక్టర్ సత్య సింధుజ  ఒక తల్లి లాంటిదని…. ప్రతి ఒక్కరూ ఆమెకు బిడ్డలాంటి వారు అని చెప్పారు. ఆమె చికిత్సలో ఎలాంటి పాక్షికతలు ఉండవని… ఈ రకమైన స్వభావం నన్ను ఆమె వైపు ఆకర్షించేలా చేసిందన్నారు.  ఈ చికిత్సను ప్రోత్సహించి, సాధ్యమైనంత ఎక్కువ మందికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ బాధ్యత మనది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ఉందన్నారు.  ఇది మన దేశానికి మాత్రమే చెందిన సంపద అని…దీన్ని  సరిగ్గా ఉపయోగించుకోవాలి అని ఆమె తెలిపారు .

కొంతకాలంగా మైగ్రేన్ సమస్యతో బాధపడిన మహేష్ బాబు ఈ పద్దతి ద్వారా చాలా ఉపశమనం పొందారని నమ్రత తెలిపారు .నొప్పిని పరిష్కరించే అద్భుత మార్గం గురించి ప్రపంచం తెలుసుకోవాలని అతను కోరుకుంటున్నాడని ఆమె తెలిపారు.  అందుకే అతను స్వచ్ఛందంగా వచ్చి, నొప్పిని పరిష్కరించే ఈ పురాతన మార్గాన్ని ప్రారంభించడానికి , ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాడని తెలిపారు.  యాంకర్ సుమ “స్పాండిలైటిస్” సమస్యతో బాధపడింది మరియు ఇప్పుడు చాలా ఉపశమనం పొందిందన్నారు. .మేము ఇప్పుడు కుటుంబ స్నేహితులం అయ్యాము అని సుమా అన్నారు. తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఆమె ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

చక్ర సిద్ద వైద్యం  ప్రత్యేకమైన చికిత్స పద్దతిని  35 తరాల నుండి  విజయవంతంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ భువనగిరి సత్య సింధూజ  తెలిపారు. తాను  25 సంవత్సరాలకు పైగా సిద్ధ చికిత్సను అభ్యసిస్తున్నట్లు ఆమె తెలిపారు. మందులు మరియు శస్త్రచికిత్స లేకుండా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న 70,000 మందికి పైగా రోగులకు చికిత్స చేసి నయం చేశామన్నారు.  పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *