గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో విస్తరణకు సూపర్ కె ప్రణాళికలు : నీరజ్ మెంటా , అనిల్ తొంటెపు
ఏపీ,తెలంగాణ ,కర్నాటక రాష్ట్రాల్లో సూపర్ కె స్టోర్ల ఏర్పాటుకు35 కోట్లు పెట్టుబడులు
హైదరాబాద్
సూపర్ మార్కెట్ చైన్ SuperK లోకి 35 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిన్న పట్టణాలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
సరికొత్త ఆలోచనతో ముందుకువెళ్తున్న SuperK దాదాపు 35 కోట్ల రూపాయల పెట్టుబడులతో విస్తరించేందుకు ప్రణాళిక రచించింది . సూపర్ కె మార్ట్ లలో సొంతంగా సాఫ్ట్ వేర్ తయారు చేసి, బ్రాండింగ్ , మార్కెటింగ్ కోసం వినియోగించనున్నట్లు వ్యవస్థాపకులు నీరజ్ మెంటా , అనిల్ తొంటెపులు తెలిపారు. ఫ్రాంఛైజ్డ్ గ్రోసరీ రిటైల్ చెయిన్ ద్వారా చిన్న పట్టణాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో 2019లో SuperK స్థాపించామని తెలిపారు. సాంకేతికత ఆధారంగా చిన్న రిటైలర్లకు , వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడం, పెద్ద రిటైల్ చైయిన్లతో సమర్థవంతంగా ఢీ కొట్టేలా ప్రణాళిక రూపొందించామన్నారు .
నేడు చిన్న పట్టణాలలోని వినియోగదారులు ఒక మంచి సూపర్ మార్కెట్ కి వెళ్ళి నాణ్యమైన సరుకులు కొనాలని కోరుకుంటున్నారని నీరజ్ మెంటా తెలిపారు. అలాంటి సేవలు అందించేదుకు SuperK అదే ప్రాంతం లో ఉన్న వారికి ఫ్రాంఛైజ్డ్ ఇచ్చి పెద్ద సూపర్ మార్కెట్ లకి ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా దోహదపడుతోందన్నారు.
ప్రస్తుతం ఉన్న సూపర్ మార్కెట్ చైన్ల తో పోటీ పడటం చిన్న వ్యాపారులకి కఠినమైన వ్యవహారం. అయినా ..అందుకు కావలసిన సేల్స్ మార్కెటింగ్ SuperK సాంకేతికత, ప్రామాణిక ఆపరేటింగ్ ప్లాన్ ద్వారా అన్ని స్టోర్ల కోసం పర్చేసింగ్, మార్కెటింగ్ , ఆఫర్లతో ఫ్రాంచైజ్ యజమానులు వినియోగధారులకు అత్యుత్తమైన సేవలు అందించగలుగుతున్నారు.
గ్రామీణ ప్రాంత రిటైల్ ప్రత్యేక అవసరాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, భారీ మార్కెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చిన్న వ్యాపారులను సిద్దం చేసేందుకు SuperK ఎండ్-టు-ఎండ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ను రూపొందించిందన్నారు. ఇది మంచి ధరలు , నాణ్యమైన సరుకులు, ఆఫర్లు, డిజిటల్ బిల్లింగ్ తదితర సేవలను అందించడానికి ఫ్రాంచైజ్ స్టోర్లను అనుమతిస్తుందన్నారు. SuperK గత ఏడాది ఆంధ్రప్రదేశ్ లోని కడప, అనంతపురం జిల్లాల్లోని 20 పట్టణాలలో దాదాపు 50 స్టోర్లను సహ-సృష్టించి లక్ష కుటుంబాలకు పైగా సేవలందిస్తోందన్నారు. ఈ ఏడాది, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, కర్నూలు జిల్లాలలో 200 ల కు పైగా ఫ్రాంచైజ్ స్టోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 021 క్యాపిటల్ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ మాట్లాడుతూ, దేశంలోని నాన్-మెట్రోపాలిటన్ కస్టమర్ల ఆకాంక్షలు, వారి ఆదాయాలలో స్థిరమైన వృద్ధి, కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెంచుతోందన్నారు. ఇది దేశంలోని కిరాణా వర్గాన్ని బ్రాండెడ్ రిటైల్ వైపు వేగవంతం చేస్తోందన్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉన్న వారితో ప్రాంచైజీలు ఏర్పాటు చేయించి, వారి ఆదాయాన్ని పెంచి, జీవితాన్ని మార్చే అవకాశాన్ని సృష్టిస్తుందన్నారు. ఫ్రాంఛైజీ దుకాణాలు సేల్ వాల్యూమ్లో నాలుగు రెట్ల వృద్ధిని సాధించాయన్నారు. వార్షిక విక్రయంలో సగటున కోటి రూపాయలు సాధించాయన్నారు.