సమస్యకు ఆత్మహత్యకు పరిష్కారం కాదు : బండారు దత్తాత్రేయ..
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, చిన్న చిన్న తప్పిదాలకు కూడా నిండు జీవితాన్ని బలితీసుకోవద్దని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ అమీర్ పేట్ గ్రీన్ పార్క్ స్పందన ఈదా ఫౌండేషన్ నిర్వహించిన ఆత్మహత్యల నివారణ సమావేశంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్ వర్చువల్ ద్వారా పాల్గొని మాట్లాడారు. సూసైడ్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ అవేర్ నెస్ అండ్ నాలెడ్జ్ ( స్పీక్) అనే అంశంపై పౌండేషన్ చైర్మన్ ఈదా శ్యామ్యూల్స్ రెడ్డి అధ్యక్షత వహించగా దత్తాత్రేయ మాట్లాడారు. భారతదేశంలో రోజురోజుకు ఉజ్జ్వల భవిష్యత్తుకు గల యువత ఎదుగుతోందని, యువత సాధించాలనే పట్టుదల ఉండాలి కాని చిన్న సమస్యను పెద్దదిగా చూస్తూ భయంతో ఒత్తిడికి గురికావద్దొన్నారు. ఒత్తిడి కలిగినప్పుడు ప్రశాంత మార్గంలో పయనించేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయని, వాటి ద్వారా మనిషి మరింత ఉత్సాహంగా తయారయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. క్షణికావేశంలో తీసుకునే చిన్న నిర్ణయం మనిషి మనుగడనే నాశనం చేస్తోందన్నారు. ఒక్క క్షణం మనోస్థైర్యంతో ఆలోచిస్తూ వాటిని ఎదుర్కొనే దిశగా వేసే ముందడుగు గొప్పదని వారు అన్నారు. ఆత్మహత్యల నివారణ పట్ల సమాజంలో అవగాహన కల్పించే దిశగా స్పందన ఈదా పౌండేషన్ ఈ అవగాహన సదస్సును చక్కటి మార్పుకు శ్రీకారం చుడుతోందని అందుకు స్పందన ఈదా పౌండేషన్ ఈదా శ్యామ్యూల్స్ రెడ్డి చేసే ప్రయత్నం విలువకట్టలేదని ఆయనను అభినందించారు. ఈదా శ్యామ్యూల్స్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణ ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొన్న మేధావులు ఆలోచనను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో ఆత్మహత్యల నివారణకు స్పందించిన ఈదా పౌండేషన్ అవగాహన బుక్లెట్ను ఆవిష్కరించారు.
ఈ సదస్సులో తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోదకుమార్, హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, మాజీ సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీకాంత్, భారతీయం సత్యవతి, ఆకెళ్ల రాఘవేంద్ర, మోటివేషనల్ స్పీకర్ వివి. రవికుమార్, కన్స్యూమర్ ఎఫైర్స్ చైర్మన్ మంద కృష్టారెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, టీవి ఆర్టీస్టులు యాహూ ప్రభాకర్, వర్చువల్ సమావేశంలో శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ ఆల్కా మనోజ్ తదితరులు పాల్గొన్నారు.