గ్రీకు నిర్మాణ శైలిలో ఇళ్ళు నిర్మించేందుకు సుచిరిండియా సంస్థ ముందుకు రావడం అభినందనీయం సమంత
హైదరాబాద్
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో గ్రీకు నిర్మాణ శైలిలో లగ్జరీ గెటెడ్ కమ్యూనిటీని ఏర్పాటు చేసేందుకు సుచిరిండియా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని సినీ నటి సమంత అన్నారు.
హైదరాబాద్ నోవాటెల్ హోటలో సుచిరిండియా సంస్థ కొత్తగా నిర్మించనున్న ద టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్ట్ లోగో సమంత ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు సమంత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్ట్ లో గ్రీకు సాంప్రదాయలతో పాటు స్మార్ట్ హోం టెక్నాలజీతో ఫ్లాట్లను అందించడం శుభపరిణామమని ఆమె తెలిపారు.
గ్రీకు నిర్మాణశైలి, సంస్కృతి, ప్రశాంత ఉండే విధంగా ప్రాజెక్ట్ రూపొందించినట్లు సుచిరిండియా సంస్థ డైరెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో 11 అపార్ట్ మెంట్లలో 450 ఫ్లాట్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ ద్వారం,క్లబ్ హౌస్, విస్తరమైన వీధులు, పార్కులు, జాగింగ్ పార్క్ , స్పోర్ట్స్, యోగా, చిల్డ్రన్స్ పార్క్, జిమ్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అబివఈద్ది చెందుతున్న సుచిర్ ఇండియా ప్రస్తుతం బెంగలూరు హైవేపై కొత్తూరు సమీపంలో గిజా పోలీస్ , ఆల్వాల్ సమీపంలో ఆర్యావర్తనగరి తో పాటు మరో 12 కొత్త ప్రాజెక్ట్ లను తీసుకువస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు.
ద టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంను పురస్కరించిన నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. అందమైన అమ్మాయిలు తమ అందచందాలను ప్రదర్శిస్తూ సాగిన షో కలర్ ఫుల్ గా సాగింది. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.