ఇంటర్నేషనల్ కార్డియాలజి సదస్సును విజయవంతం చేయండి: డాక్టర్ వై సుబ్రహ్మణ్యం
హైదరాబాద్
ఇంటర్నేషనల్ కార్డియాలజీ సదస్సును విజయవంతం చేయాలని హైదరాబాద్ రీజినల్ సీఈవో వై సుబ్రహ్మణ్యం తెలిపారు.దేశంలోని ఐదు నగరాల నుండి జులై 29 నుంచి ఆగస్ట్ మూడు తేదీ వరకు వర్చువల్ గా జరగనున్న ఈ సదస్సును అపోలో ఆసుపత్రి ,కార్డియోవాస్కులర్ రీసెర్చ్ ఫౌండేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత దేశంలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కార్డియాలజీ సదస్సుకు భారత్ ,బంగ్లాదేశ్ ,నేపాల్ , మయన్మార్, మారిషష్, శ్రీలంక తో పాటు మరికొన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. గుండె శస్త్ర చికిత్స, గుండె సమస్యల పరిష్కారానికి కొత్త చికిత్స విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఒక చిన్న రంధ్రం ద్వారా రోగిని అనారోగ్యం నుంచి మరణాల నుంచి కాపాడుకోవచ్చన్నారు. గతంలో ధమనులు పూర్తిగా మూసుకుపోయినప్పుడు శస్త్ర చికత్సతప్పనిసరి అయ్యేది ఇప్పుడుమూసుకుపోయిన ధమనులను క్లియర్ చేయడానికి ప్రత్యేక పద్దతులు అందుబాటులోకి వచ్చాయని అపోలో ఆసుపత్రి హైదరాబాద్ రీజనల్ సీఈఓ వై సుబ్రహ్మణ్యం తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగాఉన్న ప్రముఖ నిపుణులు కోవిద్ సంబంధిత కార్డియాలజీ సమస్యలను పరిష్కరించిన వైద్యులు ప్రసగించనున్నారు. గుండె సంబంధిత సమస్యల పరిష్కారం కోసం అతి తక్కువ ఖర్చు వైద్యం అందించే విధానాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు డాక్టర్ వై. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సమావేశానికి ఐదువేల మందికిపైగా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సు అందించే పరిజ్ఞానం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్డియాలజిస్టులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఈ సదస్సులో అధ్యాపకులుగా ప్రపంచంలోని ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు మరియు అనేక ప్రముఖ భారతీయ కార్డియాలజిస్టులు పాల్గొంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులకు చెందిన అంతర్జాతీయ ఫ్యాకూల్టీగా న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ డైరెక్టర్, డాక్టర్. మార్టిన్ బి. లియోన్; డాక్టర్. గ్రెగ్ డబ్ల్యూ. స్టోన్, డైరెక్టర్, న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ హాస్పిటల్; డాక్టర్. డిమిత్రియోస్ కార్మ్‌పాలియోటిస్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెషలిస్ట్, న్యూయార్క్, ఎన్‌వై; డాక్టర్. గ్యారీ మింట్జ్, సీనియర్ మెడికల్ అడ్వైజర్, కార్డియోవాస్కులర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూయార్క్; డాక్టర్.సుషీల్ కొడాలి, డైరెక్టర్, న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ హాస్పిటల్; డాక్టర్.అజయ్ జె. కిర్టానే, డైరెక్టర్, న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ హాస్పిటల్; డాక్టర్. జియాద్ ఎ. అలీ, కార్డియాలజిస్ట్, న్యూయార్క్; డాక్టర్. డువాన్ పింటో, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్; డాక్టర్. సంజోగ్ కల్రా, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ ఎడ్యుకేషన్, న్యూయార్క్; జర్మనీలోని యూనివర్శిటీ హార్ట్ సెంటర్ ఫ్రీబర్గ్‌కు చెందిన డాక్టర్. మిరోస్లా ఫెరెన్క్ మరియు వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం, డబ్ల్యువి, డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ డైరెక్టర్ డాక్టర్. రమేష్ దగ్గుబాటి తదితరులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశంలో 24 లైవ్ కేసులను 9 కేంద్రాల నుండి 4 కె ప్రొజెక్షన్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు, భారతదేశంలో మొదటిసారిగా చేస్తున్న ఇటువంటి ప్రయత్నం ద్వారా తాజా పరిజ్ఞానం అందించడం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి 5000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్న ఈ సదస్సు అతిపెద్ద ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సమావేశాలలో ఒకటిగా నిలవనున్నది. విదేశాలు మరియు భారతదేశపు ప్రముఖ కార్డియాక్ సెంటర్ల నుండి సంక్లిష్టమైన వైద్య విధానాలను నిర్వహించడంలో ఉపయోగించే తాజా పద్ధతులు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. ప్రఖ్యాత అధ్యాపకులు వారు పనిచేసే కాథ్ ల్యాబ్‌ల నుండి నూతన సాంకేతికతలను ప్రదర్శిస్తారు. సుపరిచితమైన పరిసరాలతో వారి నైపుణ్యం మరింత ఉత్తమంగా ఉందనున్నది. యుఎస్‌ఎ, జర్మనీ & యూకె మరియు భారతదేశవ్యాప్తంగా 20 కేంద్రాల నుండి లైవ్ కేసులు ప్రసారం ఉంటుంది. అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్; అపోలో హాస్పిటల్స్, చెన్నె; అపోలో హాస్పిటల్స్, బెంగళూరు; అపోలో హాస్పిటల్స్, ముంబై; మేదాంత, న్యూఢిల్లీ నుంచి ప్రత్యక్ష్య ప్రసారాలు ఉంటాయన్నారు.
ట్రాన్స్‌కాథెటర్ అరోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (టిఎవిఆర్), రైల్వే కాథెటర్ & ఇతర నూతన రేడియల్ యాక్సెస్ పరికరాలు & మెళుకువలు, ఎల్‌ఎఎ అక్లూజన్ ప్రొసీజర్స్, ఫార్మకాలజీ ఫర్ ఇంటర్వెన్షనిస్ట్స్, యాంటీ ప్లేట్‌లెట్ థెరపీ, ఎఫ్‌ఎఫ్‌ఆర్ మరియు ఐవియుఎస్ / ఒసిటితో సహా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో రోగిలో ఫలితాలను ఎలా అత్యుత్తమంగా రాబట్టవచ్చు, మిత్రా క్లిప్, ట్రాన్స్‌సెప్టల్ టెక్నిక్‌లు మొదలైన వాటిలో వచ్చిన తాజా పురోగతులను ముందస్తు ప్రణాళికతో ఎలా చేయవచ్చో ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. లైవ్ వర్క్‌షాప్‌ల ద్వారా మరియు కఠినమైన ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో టెలిమెడిసిన్ యొక్క పాత్ర & ఎఐ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది, ‘‘ఇండియా హాజ్ గాట్ టాలెంట్ సెషన్స్”- అంశంలో భారతదేశం & ఆసియా వ్యాప్తంగా వున్న యువ, డైనమిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు.