హైదరాబాద్ తాజ్ కృష్ణ లో స్టైల్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్ , బంజారాహిల్స్

భాగ్యనగరంలో ఫ్యాషన్ ఎగ్జిబిషన్ల జోరు ఊపందుకుంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు శుభకార్యాలు వాయిదా పడ్డాయి.  శ్రావణ మాసం మొదలు కావడంతో పెళ్ళిళ్ళు శుభకార్యాలను మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి.

పెళ్ళిళ్ళ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్లు కొలువుదీరుతున్నాయి. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో స్టైల్ బజార్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ఆర్గనైజర్ శీతల్ జైన్ మోడల్స్ తో కలిసి ప్రారంభించారు.

హైదరాబాదీయులు ఫ్యాషన్ ప్రియులని … ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకునే మహిళలకు ఈ ఎగ్జిబిషన్ చక్కటి ఫ్లాట్ ఫాంగా నిలుస్తుందన్నారు .

రెండు రోజుల పాటు జరిగే ఈ స్టైల్ బజార్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన అన్ని రకాల కోవిద్ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ శీతల్ జైన్ తెలిపారు . ఈ సందర్భంగా మోడల్స్ వస్త్రాలు ,బంగారు అభరణాలను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ 19 వ తేదీ వరకు కొనసాగుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *