విద్యార్థులు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో రాణించాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్, కొండాపూర్ ,జనవరి 28
ఘనంగా విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు
భవిష్యత్తులో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కొండాపూర్ విజ్ఞాన్ విద్యాసంస్థల వరల్డ్ వన్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్ పర్సన్ శ్రీమతి రాణి రుద్రమదేవి స్వాగతోపన్యాసం చేశారు. రత్తయ్య గారు పట్టుదలతో ఉన్నత ఆశయంతో విజ్ఞాన్ సంస్థ స్థాపించి .. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని తెలిపారు. విజ్ఞాన్ రత్తయ్య గారు తనకి 40 ఏళ్లుగా తెలుసునని పట్టుదలతో ఉన్నత ఆశయంతో విజ్ఞాన్ సంస్థలు స్థాపించి ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ధి రెండు తెలుగు రాష్ట్రాల్లో శాఖోపశాఖలుగా విస్తరించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రత్తయ్య వారసులుకూడా విద్యారంగంలో సేవలందించటం శుభసూచకమన్నారు. విజ్ఞాన్ విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు సాంస్కృతిక ,క్రీడా రంగాల్లోనూ సత్తా చాటేలా తీర్చిద్దడం అభినందనీమయన్నారు . విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు భారతీయ సంప్రదాయాలను అలవర్చుకోవడం, ఎన్నిభాషలను నేర్చిన మన మాతృ బాషాని మరువద్దన్నారు. భారతదేశం భిన్నత్వం లో ఏకత్వం కలిగినదని.. భారత్ విశ్వ గురువు అని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారతదేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుందన్నారు. భవిష్యత్ అంత ప్రస్తుత విద్యార్థులైనా మీదేనని… మీ అందరికి శుభాశీస్సులు అన్నారు వెంకయ్య నాయుడు . ఉపరాష్ట్రపతి పదవీ విరమణ పొందిన తర్వాత ఎక్కువగా విద్యార్థులను కలవాలని నిర్ణయించుకున్నానని … వారితో గడపాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.

అనంతరం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తూ, తప్పులు చేసినప్పుడు విమర్శించకుండా, తప్పులను సవరిస్తూ స్నేహితులవలె ఉండాలని చెప్పారు. పిల్లలలో ప్రకృతిని ప్రేమించే గుణం నేర్పాలని అప్పుడు వారు చక్కని మనస్తత్వంతో అందరి పట్ల బాధ్యతతో వ్యవహరించగలగుతారని తెల్పారు. భయంలేకుండా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను మార్గదర్శకంగా చేస్తే వారు అద్భుత విజయాలను సాధిస్తారని అందుకు ఉదాహరణగా తాము సాధించిన విజయాలే నిదర్శనం అని చెప్పారు. క్రీడల్లో, సాంస్కృతిక విద్యావిషయక కార్యక్రమాలలో జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులు సాధించిన విజయాలు తమకు గర్వకారణమన్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు నిర్వహించిన సేవా కార్యక్రమాలలో ప్రదర్శనను స్క్రీన్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు.మ్యూజిక్ వేదిక్ మ్యాథ్స్ మొదలైన కార్యక్రమాలను ప్రదర్శించి అందరిని అలరింపజేశారు.

ఈ కార్యక్రమానికి విజ్ఞాన్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ క్రాంతి కిరణ్ ,ప్రిన్సిపల్స్. కోఆర్డినేటర్స్ .ఉపాధ్యాయులు .విద్యార్థులు. తల్లిదండ్రులు పాల్గొన్నారు.
