హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 20 వ తేదీన తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి అవార్డుల ప్రధానోత్సవం
హైదరాబాద్ ,పంజాగుట్ట
విద్య,వైద్య,సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళా మణులను అవార్డులతో సత్కరించడం అభినందనీయమని మాజీ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్ అన్నారు .హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జ్యూవెలర్స్ షోరూంలో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్త్రీ శక్తి అవార్డుల విజేతలను ప్రకటించారు.
హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో ఈ నెల 20 తేదీన ఈ అవార్డులను అందజేయనున్నట్లు TCEI కమిటీ వెల్లడించింది.దేశంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తున్న డాక్టర్ మీనాక్షి అనంతరామ్‌కు స్త్రీ శక్తి అవార్డు దక్కిందని తేజ్‌దీప్ కౌర్ తెలిపారు .ప్రస్తుతం డాక్టర్ మీనాక్షి అనంతరామ్ Razzmatazz కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రెండ వ్యక్తి కరీంనగర్ జిల్లా నుంచి వావిలాల రాఘవ నర్సింగ్ హోం గైనకాలజిస్ట్ డాక్టర్ నోముల హేమలతకు, జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన స్వయం సహాయం బృందం మహిళ సత్యలక్ష్మీకి దక్కిందన్నారు. ఇక చివరిగా కోచ్లైఫ్ ఏసియా వ్యవస్థాపక డైరెక్టర్ శాంత కె సిన్హాకు స్త్రీ శక్తి అవార్డులు దక్కినట్లు కమిటీ వెల్లడించింది.
మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు అందిస్తున్నామని…స్త్రీ రతన్ ఇండస్ట్రీ లెజెండ్స్, స్త్రీ మూర్తి , స్త్రీ శక్తి అవార్డులను అందజేయనున్నట్లు కమిటీసభ్యులు తెలిపారు . ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, వినోదం, హాస్పిటాలిటీ, మహిళా సాధికారత, సామాజిక సేవ, ఉమెన్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ,పబ్లిక్ లైఫ్‌లో వారి అనుభవం ఆధారంగా మూడు విభాగాలలో 50 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు , ప్రత్యేక మహిళా సాధకులకు అవార్డులు ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా తేజ్ డీప్ కౌర్ మాట్లాడుతూ ఈవెంట్ మేనేజ్మెంట్లో మహిళలది అరుదైన పరిణామమన్నారు. అలాంటి వారిని మనం గౌరవంగా సన్మానించుకోవాలి అన్నారు. మానేపల్లి జ్యువెలర్స్ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ అవార్డుల కార్యక్రమంతో అనుబంధం ఏర్పడడం గర్వంగా ఉందన్నారు. స్త్రీలు , నగల వ్యాపారులు విడదీయరానివి. మహిళలు ఆభరణాలు ధరించడం మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం. శ్రేష్ఠమైన మహిళలను గుర్తించడం ,వారిని అవార్డుతో సత్కరించడం మహిళల సాధికారతకు చాలా ఉపోయోగపడుతుందన్నారు .