తెలంగాణ యువ స్విమ్మింగ్ క్రీడాకారిణి కుమారి వ్రితి అగర్వాల్ ను అభినందించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియం

ఫినా వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్ సెలెక్షన్స్ కి సౌత్ ఆఫ్రికా వెళ్లనున్న భారత స్విమ్మింగ్ జట్టుకు ఎంపికైన తెలంగాణ యువ స్విమ్మింగ్ క్రీడాకారిణి కుమారి వ్రితి అగర్వాల్ కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు.

హైద‌రాబాద్ లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలోని ఛైర్మ‌న్ ఛాంబ‌ర్ లో వెంక‌టేశ్వ‌ర రెడ్డిని వ్రితి అగ‌ర్వాల్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర రెడ్డి వ్రితి అగ‌ర్వాల్ కు శాలువ క‌ల్పి పుష్ప‌గుచ్చం అంద‌జేసి శుభాకాంక్షలు తెలిపారు.

తెల‌గాణ యువ స్విమ్మింగ్ క్రీడాకారిణి వ్రితి అగ‌ర్వాల్ హైద‌రాబాద్ భ‌వ‌న్స్ అత్మ‌కూరి రామారావు స్కూల్ లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చదువుతోంది. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ప‌ద‌కొండో తేదీ వ‌ర‌కు సౌత్ ఆఫ్రికాలో ని పోర్ట్ ఎలిజిబెత్ లో సౌత్ ఆఫ్రికా నేషనల్ ఛాంపియన్ షిప్ జ‌రుగుతోంది. ఈ పోటీల్లో క్వాలిఫై అయిన క్రీడాకారులు ఆగ‌స్ట్ 23 నుంచి 28 వ తేదీ వ‌ర‌కు సౌత్ ఆఫ్రికాలో జ‌రిగే ఫినా వ‌ర‌ల్డ్ జూనియ‌ర్ ఛాంపియ‌న్ షిప్ లో పాల్గొన‌డానికి అర్హ‌త సాధిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జూనియ‌ర్ భార‌త జ‌ట్టుకు ఎంపికైన తొలి స్విమ్మ‌ర్ గా ఘ‌నత సాధించిన తొలి క్రీడాకార‌ణి వ్రితి అగ‌ర్వాల్ కు రానున్న రోజుల్లో మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఛైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామ కృష్ణ, ట్రెజ‌రర్ జీ.ఉమేష్, కోచ్ జాన్ సిద్ధిఖి, క్రీడాకారిణి వ్రితి అగర్వాల్ తండ్రి వినీత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *