బడ్జెట్​తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు: సీపీఐ నేత రామకృష్ణ

కేంద్ర బడ్జెట్​-2022పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్​తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బడ్జెట్​లో విద్య, వైద్య రంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్యులకు సున్నాగా.. కార్పొరేట్లకు మిన్నగా కేంద్ర బడ్జెట్-2022 ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేంద్ర బడ్జెట్​లో విద్య, వైద్య రంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్​తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధులను గురించి ప్రస్తావించలేదు.. లోటు బడ్జెట్ గురించి ఊసే లేదని రామకృష్ణ విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని కేంద్రాన్ని నిలదీశారు. పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తామనడం.. మరిన్ని ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పడమేనని ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ ప్రకటనతో వేతన జీవులు నిరాశ చెందారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *