టాలెంట్ ఉండి అవకాశాలు లేని వారికి స్టార్ బజ్ యాప్ మంచి ప్లాట్ ఫాం :బాలీవుడ్ నటి శ్రద్ధాదాస్

హైదరాబాద్ ,కొండాపూర్

ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉండి అవకాశాలు లేని వారికి స్టార్ బజ్ సంస్థ మంచి ఫ్లాట్‌ఫాంగా నిలుస్తుందని సినీ నటి శ్రద్దాదాస్ అన్నారు .హైదరాబాద్ కొండాపూర్ లోని హార్ట్ కప్ కేఫ్‌లో స్టార్ బజ్‌ యాప్‌ లోగోను ఆమె ఆవిష్కరించారు .స్టార్ బజ్ యాప్‌లో తమ టాలెంట్‌కు సంబంధించిన విషయాలు తెలియజేస్తే సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి అందించి ..అవకాశాలు కల్పిస్తామని ఫౌండర్‌ కృష్ణ ప్రియ తెలిపారు . కళాకారులు, ఇతర రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఆమె తెలిపారు .

హైదరాబాదీ స్టార్టప్ సంస్థ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నుంచి స్టార్‌బజ్ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది . సామాజిక మాద్యమాలలో ప్రభావశీలుల కోసం సింప్లీ సోషల్ అనే పేరుతో వర్క్‌షాప్ ను నిర్వహించింది.

సామజికమాద్య ప్రభావశీలుల కోసం ఏర్పాటుచేసిన వర్క్‌షాప్ లో పాల్గొని మారుతున్న సామాజిక మాద్య ప్రమోషనల్ కార్యక్రమాల గురించి వ్యాపార ప్రకటనలకు సామజికమాద్యం ఆవస్యకత గురించి చర్చించారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రముఖ యాంకర్ శివజ్యోతి, స్టార్‌బజ్ వ్యవస్థాపకురాలు కృష్ణప్రియ ఆకెల్ల, సహ వ్యవస్థాపకురాలు అరవింద బొల్లినేని పాల్గొన్నారు.

80 మంది సోషల్ మీడియా ప్రభావశీలులు ఈ వర్క్‌షాప్‌కు హాజరవ్వగా ప్యానెల్ చర్చలో, ప్రతినిధులు ప్రభావిత మార్కెటింగ్, బ్రాండ్ ఎక్స్‌పోజర్, సోషల్ మీడియా భవిష్యత్తు మార్పుల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా సినీ నటి శ్రద్ధా దాస్ మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు సామాజిక సమస్యలను లేవనెత్తె సాధనంగా తయరయ్యాయని, వ్యాపారవేత్తలు తమ ప్రేక్షకులను త్వరగా చేరుకునే వేదికగా మారాయని అన్నారు. తను మాట్లాడుతు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు బ్రాండ్లు ఒకదానికొకటి లేకుండా ఉండవు, స్టార్‌బజ్‌ ప్రభావశీలులను మరియు బ్రాండ్‌లను కలిపేటువంటి ఓ మంచి వేదిక, ఇధి రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా స్టార్‌బజ్ వ్యవస్థాపకురాలు కృష్ణ ప్రియా ఆకెల్ల మాట్లాడుతూ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు బ్రాండ్‌లను నేరుగా ఒకే వేదికపై కమ్యూనికేట్ చేయడానికి, అధిక వ్యయంతో కూడిన ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కు ఒక రకమైన పరిష్కారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ స్థాపించామని అన్నారు.

ఆమె వర్క్‌షాప్ గురించి మాట్లాడుతు, ఈ కార్యక్రమం ఇన్‌ఫ్లుయెన్సర్ లకు సహకరించడానికి, నెట్‌వర్క్ చేయడానికి మరియు బ్రాండ్‌లకు కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందించింది. భారతదేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రభావం అధికంగా ఉన్నందున, బ్రాండ్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు స్టార్‌బజ్ మంచి వేదికగా నిలవగలదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *