కనుల పండుగ గా శ్రీరామానుజ సహస్రాబ్దీ సమారోహ ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో శ్రీరామానుజ సహస్రాబ్దీ సమారోహ ఉత్సవాలు
సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో సుమారు 2 వేల 500 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో మచ్చింతల్ లోని జీవా ప్రాంగణం మురిసిపోయింది. సమతామూర్తి విగ్రహం నుంచి యాగశాల వరకు ప్రదర్మనగా బయల్దేరిన కళాకారులు తమ కళారూపాలతో ఆకట్టుకున్నారు. డప్పు డోలు, గుస్సాడి, బోనాలు, బతుకమ్మ, పెద్దపులి వేషాలు సహా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు సహస్రాబ్ది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత అశ్వవాహనంపై పెరుమాళ్లస్వామి శోభాయాత్ర దివ్యసాకేతం నుంచి ప్రారంభమయింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆరంభమైన ఈ యాత్రలో అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి, రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరీ రామానుజ జీయర్ స్వామి, వ్రతధర రామానుజ జీయర్ స్వాములు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ భగవత్ రామానుజల నినాదాలతో అత్యంత వైభవోపేతంగా 3 కిలో మీటర్ల మేర సాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రుత్వికులు, అర్చకస్వాములు ఈ యాత్రలో ముందుండి నడిపించారు. కోలాటాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో శ్రీమన్నారాయణ నామసంకీర్తనలతో ఈ శోభాయాత్ర పవిత్ర యాగశాలలోకి చేరింది. యాగశాలలో తొలుత పెరుమాళ్ల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఐదుగురు జీయర్ స్వాములు అనుగ్రహభాషణం చేశారు. 1035 హోమ గుండాలలో నిర్వహించే కార్యక్రమాలను భక్తులకు వివరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైంహోమ్ గ్రూప్ అధినేత డా. జూపల్లి రామేశ్వరరావు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ప్రథమంగా విశ్వక్సేన పూజతో ప్రారంభించి వాస్తు ప్రాంగణ శుద్ధి, పుణ్యహవచనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వాస్తుహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా జరిగాయి. యాగశాలకు వచ్చిన భక్తులకు వాస్తుశాంతి పూజ ప్రాధాన్యతను అందులోని విశిష్టతను చిన్న జీయర్ స్వామి వివరించారు. 144 యాగశాలల్లో జరిగే 1035 హోమ గుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలోనే భగవద్రామానుజుల పోస్టల్ కవర్, పోస్టల్ స్టాంప్ ను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వి.వి.సత్యనారాయణ రెడ్డి సమక్షంలో చిన్న జీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు.
సాయంత్రం వేళ యాగశాలలో వేదపారాయణ మధ్య సహస్రాబ్దీ వేడుకలకు అంకురార్పణ చేశారు. ప్రధాన యాగశాలలో రుత్విక్వరణం, యజమానులకు కంకణధారణ జరిగింది. అనంతరం దీక్షలు స్వీకరించి యాగదీక్ష స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చిన్న జీయర్ స్వామివారి శిష్యబృందం ఆధ్వర్యంలో జీవ ప్రాంగణం నుంచి పవిత్ర యాగశాల వరకు సాంస్కృతిక శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.
రేపటి కార్యక్రమాల్లో భాగంగా యాగశాలలో అరణి మథనం, అగ్ని ప్రతిష్ఠ, సుదర్శనేష్టి, వాసుదేవనేష్టి, శ్రీపెద్ద జీయర్ స్వామి వారి పూజ విశేషంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రవచన మండపంలో పండితులచే ప్రవచనాలు, దేశవిదేశాల నుంచి విచ్చేసిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగనున్నాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో సుమారు 2 వేల 500 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో మచ్చింతల్ లోని జీవా ప్రాంగణం మురిసిపోయింది. సమతామూర్తి విగ్రహం నుంచి యాగశాల వరకు ప్రదర్మనగా బయల్దేరిన కళాకారులు తమ కళారూపాలతో ఆకట్టుకున్నారు. డప్పు డోలు, గుస్సాడి, బోనాలు, బతుకమ్మ, పెద్దపులి వేషాలు సహా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు సహస్రాబ్ది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి