రాజ నర్సింహా రావు మెమోరియల్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నమెంట్ ను ప్రారంభించిన స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి

సికింద్రాబాద్, ఆగస్ట్ 30

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు టోర్నమెంట్ లు ఎంతగానో దోహదపడతాయని స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి అన్నారు.

సికింద్రాబాద్ క్లబ్ లో వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ నర్సింహా రావు మెమోరియల్ వరల్డ్  టెన్నిస్ టూర్ టోర్నమెంట్ ను స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.  ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా  అండర్ – 18 కు చెందిన  120 మంది  క్రీడాకారులు పాల్గొన్నారు.

అందులో మన రాష్ట్రం నుండి 30 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషం, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుండి సానియా మీర్జా మరియు విష్ణువర్ధన్ లాంటి  క్రీడాకారులను   వెలికితీయాలని  తెలంగాణ రాష్ట్ర టెన్నిస్  అసోసియేషన్ ను వెంకటేశ్వర్ రెడ్డి కోరారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ  టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్  చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ రావు, సెక్రెటరీ ఆఫ్ మురళీరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఆఫ్ నారాయణ్ దాస్, విష్ణు వర్ధన్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *