సోనుసూద్ చేతుల మీదుగా బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోవడం సంతోషం గా ఉంది:వింగ్స్ మోడెల్ హబ్ హైదరాబాద్ డైరెక్టర్ మనోజ్ వీరగోని

గోవా

ఇంటర్నేషనల్ గ్లోరి అవార్డ్స్ 2021 ప్రధానోత్సవ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. గోవాలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సినీ నటుడు సోనుసూద్ ముఖ్య అథిదిగా హాజరయ్యారు . హైదరాబాద్ కు చెందిన వింగ్స్ మోడెల్ హబ్ హైదరాబాద్ డైరెక్టర్ మనోజ్ వీరగోనికి బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ దక్కింది.

నటులు సోను సూద్ చేతులమీదుగా “బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ అఫ్ ది ఇయర్ అవార్డ్”ను మనోజ్ వీరగొని అందుకున్నారు.

హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వింగ్స్ మోడల్ హబ్ డైరెక్టర్ మనోజ్ వీరగొని మాట్లాడుతూ, “ఇటీవల మేము నిర్వహించిన, మన హైదరాబాద్ లోనే అత్యుత్తమైన ఫ్యాషన్ పెజెంట్ 2021 వింగ్స్ మిస్టర్ & మిస్ హైదరాబాద్ 2021 గాను మాకు ఈ గుర్తింపు లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ అవార్డును రియల్ హీరో సోను సూద్ చేతుల మీదుగా తీసుకోవటం సంతోషం గా ఉందన్నారు. మా సంస్థ, వింగ్స్ మోడెల్ హబ్ కి గత నెలలో మన దేశం లో మునుమెన్నడు లేని విధంగా 260 మోడల్స్ తో ఒకేసారి ఆడిషన్ నిర్వహించనదుకు గాను బెస్ట్ మోడలింగ్ ఏజెన్సీ అవార్డ్ బెంగళూరులో వచ్చిందని వెల్లడించారు.

వ్యక్తిగతంగా నా గత విజయాలు – మిస్టర్ తెలంగాణ, మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ ఇండియా టాలెంటెడ్ సరసన బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ అవార్డ్ చేరటం గర్వంగా వుంది.”మనోజ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *