వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు సోనాలికా అగ్రో సొల్యూషన్స్ యాప్ ఎంతగానో దోహదపడుతుంది: సోనాలికా గ్రూప్ ఈడీ రమణ్ మిట్టల్
హైదరాబాద్, ఆగస్టు 2021
సాంకేతికత ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా ఈ సాంకేతికత తనదైన ప్రభావం చూపడం ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ట్రాక్టర్ బ్రాండ్ సోనాలికా ఇప్పుడు సాంకేతికత ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ, డిజిటలీకరణను చేసేందుకు ముందుకు వచ్చింది. సోనాలికా తమ నూతన ‘సోనాలికా అగ్రో సొల్యూషన్స్ ట్రాక్టర్, ఇంప్లిమెంట్స్ యాప్’ను విడుదల చేసింది.ఈ రెంటల్ యాప్ ద్వారా ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర సామాగ్రిని అద్దెకు అందించవచ్చు. రైతులు వ్యవసాయ యంత్ర సామాగ్రిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చు. రైతుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగు పర్చుకోవచ్చు.
సోనాలికా అగ్రో సొల్యూషన్స్ ట్రాక్టర్, ఇంప్లిమెంట్ రెంటల్ యాప్ రైతులకు వరం లాంటిదని సోనాలికా గ్రూప్ ఈడీ రమణ్ మిట్టల్ తెలిపారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ఆయా ప్రాంతాల రైతుల మధ్య సత్ సంబంధాలు మెరుగుపడటంతో పాటు ఆపరేటర్లకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
సోనాలికా ఆగ్రో సొల్యూషన్స్ యాప్ ద్వారా రైతులు అదనంగా సంపాదించుకునే అవకాశం కలుగుతుందని రమణ్ మిట్టల్ తెలిపారు. రైతులు తమ దగ్గర ఉన్న వ్యవసాయ పనిముట్లు యాప్ ద్వారా ఇతర రైతులకు అద్దెకు ఇవ్వడం వల్ల అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.
ఈ యాప్‌ను గుగూల్ ప్లే స్టోర్ నుంచి అత్యంత సౌకర్యవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చున్నారు. రైతులకు నమోదు ప్రక్రియలో సహాయపడేందుకు టెలి కస్టమర్ మద్దతు సైతం అందుబాటులో ఉంచామన్నారు.
ఈ నూతన వ్యాపార కార్యక్రమం గురించి సోనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం సిసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ఉద్దేశంతో ఈ యాప్ ను రూపొందించామన్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణలకు సోనాలికా ట్రాక్టర్ నేతృత్వం వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రతి ఒక్క రైతుకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ యాప్ ను రూపొందించామన్నారు. డిజిటలైజేషన్ యుగంలో సోనాలికా ఆగ్రో సొల్యూషన్స్ యాప్ విడుదల చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రాక్టర్లు ,పనిముట్ల అద్దెకు ఈ యాప్ తోడ్పడుతుందన్నారు.