కరోనా సమయంలో పేదలకు సేవ చేసిన గుడ్ల ధనలక్ష్మిని ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు తో ఘనంగా సన్మానించిన శృతిలయ ఆర్ట్స్ అకాడమి
సాంస్కృతిక రంగం పై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తెలంగాణ తొలి శాసనసభాపతి మధుసూదనాచారి అన్నారు.
హైదరాబాద్ త్యాగరాయగాన సభలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్
సంయుక్తంగా నిర్వహించిన సీల్‌వెల్ సినీ సుస్వరాల సంగీత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరోనా కాలంలో కరుణహృదయంతో పేదలకు సేవలందించిన గుడ్ల ధనలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ గుడ్ల ధన లక్ష్మీని ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుతోనూ…సంగీత సేవ చేస్తున్న వైజాగ్ రామకృష్ణను స్వరశిఖర అవార్డుతో ఘనంగా సత్కారించారు.
ప్రజలకు మానసిక ఉల్లాసం అందించే సాంస్కృతి కార్యక్రమాలు గత రెండేళ్లుగా లేక పోవడం
చాలా విచారకమని మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారితో పాటు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, కళపత్రిక సంపాదకులు మహ్మద్‌రఫీ,ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం ,కుసుమ భోగరాజు, ఆమని తదితరులు పాల్గొన్నారు.