కూచిపూడి నృత్య అరంగేట్రం చేసిన శాలిని దేవరకొండ…
హైదరాబాద్:
హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ లో శాలిని దేవరకొండ కూచిపూడి నృత్య అరంగేట్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఆఫ్ IDRTC మరియు ఆఫీసయల్ స్టేట్ రేప్రెసెంటివ్ మినిష్టరి ఆఫ్ కల్చర్ గౌర్నమెంట్ ఆఫ్ ఇండియా డా”తాడేపల్లి , ఫ్యాకలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ యూనివర్శిటీ ఆఫ్ సిలికానాంధ్ర కాలిఫోర్నియా USA కళాశ్రీ ప్రొఫెసర్ రమాదేవి, కూచిపూడి డాన్స్ మాస్టర్ ప్రెసెండిట్ అవార్డ్ గ్రహీత
వేదాంతం రాధేశ్యాం ముఖ్య అతిథిలుగు హాజరయ్యారు. 11 సంవత్సరాల చిన్నారి శాలిని కూచిపూడి నృత్యం ప్రదర్శన తో అలరించింది.

వినాయక కౌత్వం తో మొదలుపెట్టి మరకథమణి మాయ చాలే, భామ కాలపం, ముద్దుగారే యశోద మరియు దశావతారం తో శాలిని ప్రదర్శించింది. శాలని మూడేళ్ల ప్రాయం నుంచే కూచిపూడి న్యాట్యంలో శిక్షణ పొందుతోంది. కార్యక్రమం అనంతరం శాలిని మాట్లాడుతూ.. నాట్యకారిణిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నానని, తద్వారా ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నట్టు పేర్కొంది. ప్రపంచంలోని ప్రతి మూలకు కూచిపూడి నాట్య వైభవాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నట్టు తెలిపింది

శాలిని దేవరకొండ గురువు దుర్గేష్ నందిని మాట్లాడుతూ.. శాలిని తమ ఇనిస్టిట్యూట్‌లో చేరేందుకు వచ్చినప్పుడే ఆ చిన్నారి కళ్లలో మెరుపు చూసినట్టు చెప్పారు. ఆమె తపన, గ్రహణ శక్తే ఆమెను నాట్యకారిణిగా తీర్చిదిద్దాయన్నారు. “తాడేపల్లి మాట్లాడుతూ.. చిన్నవయసులోనే అత్యద్భుత ప్రతిభ కనబరిచిన శాలిని ని అభినందించారు. అరంగేట్రం కోసం ఆమె పడిన కష్టం ప్రదర్శనలో కనిపించిందన్నారు. శాలిని ని ఇతర విద్యార్థులు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కుమార్తె అరంగేట్రంపై తల్లిదండ్రులు రూపరాణి , విక్రమ్ దేవరకొండ, మాట్లాడుతూ.. నృత్యం పట్ల కుమార్తె ఆసక్తిని గమనించే కూచిపూడి తరగతులకు పంపామని, ఈ ప్రదర్శన పట్ల పూర్తి ఆనందంగా ఉందని అన్నారు.
