సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

అమరుల స్మారక చిహ్నం నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలి

ఫినిషింగ్ వర్క్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి

  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్:

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచి ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను,వర్క్స్ ఏజెన్సీని అదేశించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు మంత్రి వేముల సెక్రటేరియట్,అమర వీరుల స్మారక చిహ్నం పనులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు.

ముందుగా సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకుని అక్కడే ఉండి వివిధ పనులు పరిశీలించారు.సుమారు నాలుగు గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగారు.

గ్రాండ్ ఎంట్రీ, రెడ్ సాండ్ స్టోన్ జీఆర్సి క్లాడింగ్ పనులు, పోర్టికో స్లాబింగ్ పనులు,విండోస్ స్ట్రక్చరల్ గ్లేనింగ్,కాంపౌండ్ వాల్ రేయిలింగ్ పనులు,సీఎం ఛాంబర్,మంత్రుల చాంబర్స్, సెక్రెటరీల చాంబర్స్,వివిధ శాఖలకు సంబంధించిన వర్క్ స్టేషన్ ఏరియా పనుల పురోగతి పరిశీలించారు.
వర్క్ స్టేషన్ ఏరియాలో సీటింగ్,కంప్యూటర్ తో పాటు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే సౌకర్యాలను పరిశీలించి వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు.

అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సీఎం ఛాంబర్,మంత్రుల ఛాంబర్,ఆఫీసర్స్ చాంబర్స్ ఫర్నీచర్ డిజైన్లు ఫైనల్ చేశారు. సీఎం ఛాంబర్ తో పాటు వివియిపి లాంజ్ లో ఉపయోగించే టైల్స్ పరిశీలించారు. గ్రానైట్ ఫ్లోర్ స్టెప్స్ టైల్స్ ఫైనలైజ్ చేశారు. కోర్ట్ యార్డ్, ప్రైమ్ ఏరియా లైటింగ్ బిగింపు ఫైనల్ చేశారు. గ్రాండ్ ఎంట్రీ మెయిన్ డోర్ కు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని రూపొందించిన పలు డిజైన్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు వాటిని ఫైనలైజ్ చేయనున్నారు.

పోయిన విజిట్ లో మంత్రి మ్యాన్ పవర్ పెంచాలని వర్క్స్ ఏజెన్సీని అదేశించారు.అందుకు తగట్టు.. అప్పుడు 1450 మంది ఉండగా ప్రస్తుతం మ్యాన్ పవర్ 2,118 కి పెంచి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు.దీంతో ఫినిషింగ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన గడువులోగా ఫ్లోర్ వైస్ సమాంతరంగా నిర్మాణ పనులు పూర్తి కావాలని మంత్రి ఆర్ అండ్ బి అధికారులను,వర్క్ ఏజెన్సీని అదేశించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం పనుల పురోగతి పరిశీలించారు. సుమారు మూడున్నర గంటల పాటు నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు. ఫినిషింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని,అట్లాగే వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మెయిన్ ఎంట్రీ,తెలంగాణ తల్లి విగ్రహం,గార్డెన్ ఏరియా, పై అంతస్థులో నిరంతరం వెలుగుతున్న జ్యోతి ఆకృతి వచ్చే నిర్మాణాన్ని,మ్యూజియం,గ్యాలరీ తో పాటు ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు. అధికారులకు,వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. ప్యానెల్స్ బిగింపు ప్రక్రియ వేగిరం చేయాలని సూచించారు. ఈ నిర్మాణం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని ప్రతి పని మనసుపెట్టి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అందుకే ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని మంత్రి అదేశించారు.

మంత్రి వెంట ఈఎన్సి గణపతి రెడ్డి,ఎస్.ఈ లు సత్యనారాయణ, హఫీజుద్దిన్,లింగా రెడ్డి, ఈ.ఈ లు శశిధర్,నర్సింగరావు,ఆర్కిటెక్ట్ ఆస్కార్, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ,నిర్మాణ సంస్థ ప్రతినిధులు,పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *