ప్రైవేటు , కార్పొరేట్ స్కూళ్లు దోపిడీ పై ప్రభుత్వం సీరియస్

కరోనా కారణంగా స్కూలు మూతపడినా …ఆన్ లైన్ క్లాసులు పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్లో పై ప్రభుత్వం కొరడా జుళిపించింది. గత ఏడాది వసూలు చేసిన ఫీజులే ఈ ఏడాది వసూలు చేయాలని జీవోలో పేర్కొంది.ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచకూడదు అంటూ జిఓ నెంబర్ 75 ప్రభుత్వం విడుదల చేసింది.

గత ఏడాది కరోనా కారణంగా స్కూళ్లు మూతబడ్డాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైన ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో కళాశాలలో ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో పది శాతం అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిన ఫీజు లే ఈ ఏడాది వసూలు చేయాలని కొత్త జీవో జారీ చేసింది .గతేడాది జీవో నెంబర్ 46ను కొనసాగిస్తూ. కొత్తగా జీవో 75 ను విడుదల చేసింది ప్రభుత్వం. 2020 21 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులనే ఈ ఏడాది వసూలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని. అదీ నెల వారిగా వసూలు చేయాలని జీవోలో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే స్కూల్స్ అనుమతి రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *