సెయిలింగ్ సాహసోపేతమైన క్రీడ :గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

హైదరాబాద్

సెయిలింగ్ సాహసోపేత క్రీడ అని … గాలి వేగాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం గొప్పవిషయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2021 పోటీలను ఆమె ప్రారంభించారు .

గవర్నర్ తమిళిసై హుస్సేన్‌సాగర్‌లోని బోటులో షికారు చేశారు.

దేశంలోని పలు నగరాలకు చెందిన క్రీడాకారులు ఈ సెయిలింగ్ పోటీల్లో పాల్గొననున్నారు .భవిష్యత్‌లో సెయిలింగ్‌లో మంచి శిక్షణ ఇచ్చిదేశానికి పతకాలు తీసుకురావాలని గవర్నర్ క్రీడాకారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *