హైదరాబాద్ గచ్చిబౌలిలో బాలికల సాధికారత కోసం సేవా భారతి అద్వర్యంలో “రన్ ఫర్ గర్ల్ చైల్డ్”

హైదరాబాద్, 13 ,ఫిబ్రవరి 2023

సేవా భారతి తెలంగాణ అద్వర్యంలో బాలికల సాధికారత కోసం , ఇందుకు కృషి చేస్తున్న “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 21/10/5 కె రన్ 7వ ఎడిషన్‌ గచ్చిబౌలి లో ఆదివారం ఉత్సాహంగా జరిగింది.

ఈ రన్ ను స్టేడియంలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, పోలీసు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, అఖిల భారత సేవా భారతి ప్రధాన కార్యదర్శి రేణు పాఠక్ లతో పాటు మల్టీ నేషనల్ సంస్థల కార్పొరేట్ అధిపతులు కూాడా కలిసి జండా ఊపి ప్రారంబించారు.

5, 10, 21 కిలోమీటర్ల, మేర మూడు విభాగాల్లో కొనసాగిన ఈ రన్ లో కార్పొరేట్‌లు, వారి కుటుంబాలు, మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు విద్యార్థుల పది వేలకు పైగా పాలుపంచుకున్నారు. ఈ రన్ గచ్చి బౌలి స్టేడియం నుండి ప్రారంభమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు 5 కిలోమీటర్లు కొనసాగగా, సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా 10 కిలోమీటర్లు మరియు 21 కిలోమీటర్ల రన్ తిరిగి స్టేడియానికి చేరుకుంది.

ప్రస్తుతం, 300 కిషోరి వికాస్ కేంద్రాలు హైదరాబాద్ మురికివాడల్లో 6700 మంది లబ్ధిదారులతో చురుకుగా పనిచేస్తున్నాయని, ఈ రన్ ద్వారా మరో 500 కిషోరి కేంద్రాలను విస్తరిస్తూ 10,000 మంది లబ్ధిదారులకు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సేవా భారతి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి ప్రభాల తెలిపారు. ఈ కేంద్రాలు మురికివాడలు, తక్కువ ఆదాయ ప్రాంతాలలో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్యం మరియు నైపుణ్య అభివృద్ధికి తోడ్పడుతున్నాయని ఆయన మీడియాకు తెలిపారు.

ఈ రన్ లో ఇన్ఫోసిస్, జీఈపీ, జెన్‌ప్యాక్ట్‌ల ప్రతినిధులు హాజరు కాగా, యశోద హాస్పిటల్స్, టెక్‌వేవ్, టెక్ వేదిక, GEP, సినోప్సిస్, పెగా సిస్టమ్స్, గ్లోబల్‌లాజిక్, హెల్త్‌ఎడ్జ్, కోటివిటి, 91 సిగ్నేజ్‌లు, ఫీవర్ FM మరియు ఇన్నోవా సొల్యూషన్స్ వంటి సంస్ధలు రన్‌కి భాగస్వామ్యా మద్దతునిచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *