పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ కష్టపడుతున్నారు-ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్

పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ కష్టపడతారని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ( ఐపీఎస్ ) అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంక్షేమ మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమమే ఆర్టీసీ సంస్థ ప్రధాన ధ్యేయం అని… ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని సజ్జనర్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రేవేట్ రవాణా వ్యవస్థ నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉందని… వాటికి దీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను కోరారు. ఆర్టీసీ మొదటిసారి స్లీపర్ సర్వీసులను ప్రారంభిచామని సజ్జనర్ తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఉద్యోగులకు ఎక్స్ ట్రా మైల్ అవార్డులను అందజేసి ఘనంగా సన్మానించారు.