ఐడియా బాక్స్ సీజన్ 2 విజేత‌ల‌ను ప్ర‌క‌టించిన రూట్ క్యాప్

హైద‌రాబాద్, బంజారాహిల్స్

పరిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన ఫండింగ్, మార్కెటింగ్ త‌దిత‌ర సేవ‌లు అందిస్తున్న రూట్ క్యాప్ సంస్థ.. ఐడియా బాక్స్ పేరుతో కాంటెస్ట్ నిర్వ‌హించింది .

హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని లుంబిని జ్యువెల్‌ మాల్‌లో బి హ‌బ్ లో ఐడియా బాక్స్ సీజ‌న్ టూ విజేత‌ల‌కు ఘ‌నంగా స‌త్క‌రించింది. ఈ పోటీల్లో 600 మంది విద్యార్థులు ,ఉపాధ్యాయులు,గృహిణిలు ,స్వ‌యం ఉపాధి క‌లిగిన నిపుణులు వ్యాపార‌వేత్తలు పాల్గొన్నారు.

ఈ పోటీల్లో గుంటూరుకు చెందిన కెఎల్‌ యూనివర్శిటీ విద్యార్థులు వంశీ, భార్గవ రామయ్య , దశరథ రామయ్యలతో కూడిన బృందం మొదటి బహుమతిని కైవ‌సం చేసుకుంది . రెండవ స్ధానంలో చెన్నైకు చెందిన సంజయ్‌ బృందం, మూడవ స్థానంలో అమలాపురంకు చెందిన వెంకట రమణ, వంశీ, మణికంఠ, రమేష్‌ నిలిచారు. హైదరాబాద్‌, చెన్నై, తూర్పుగోదావరిలకు చెందిన ఆరుగురు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. దాదాపు 20 ఆలోచలనను ఇన్‌క్యుబేషన్‌ లేదా పెట్టుబడుల కోసం ఎంపిక చేశారు.

ఈ బ‌హుమతుల ప్ర‌ధానోత్స‌వంలో రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్ డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగ్నేకర్ పాల్గొన్నారు. వ్యవస్ధాపక ఆలోచనలతో ప్రస్తుత తరం ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన వివ‌రించారు. పెట్టుబడిదారులు ఓ ఆలోచనను ఎంపిక చేసుకునేందుకు పరిగణలోకి తీసుకునే అంశాలను వెల్లడించారు.

ఈ కార్య‌క్ర‌మంలో కంపెనీ డైరెక్టర్లు కిరణ్‌ బాబు, సంజన షా, కెవీటీ రమేష్‌, సునీల్‌ సెథయా, శ్రీకర్‌ కంద, విశాల్‌ దేశాయ్ పాల్గొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ ఆలోచనలను www.ideaboxglobal.com కు పంప‌వ‌చ్చుని వారు తెలిపారు. పోటీతో సంబంధం లేకుండా పంపే అవకాశం ఉందని… తమ ఆలోచన వ్యాపారంగా మారే అవకాశంగా ఉందా లేదా అన్నది కూడా వారు తెలుసుకోవచ్చ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *